Brahmamudi: తాతయ్యకు బ్లడ్ క్యాన్సర్.. కావ్య, రాజ్ ఓవరాక్షన్ భరించలేకపోతున్న అపర్ణ!

Published : Sep 05, 2023, 09:56 AM IST

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తన కాపురం ఏమైపోతుందో అని తపన పడుతున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 5 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
17
Brahmamudi: తాతయ్యకు బ్లడ్ క్యాన్సర్.. కావ్య, రాజ్ ఓవరాక్షన్ భరించలేకపోతున్న అపర్ణ!

 ఎపిసోడ్ ప్రారంభంలో సీతారామయ్యను తీసుకువచ్చి హాల్లో కూర్చోబెడతాడు రాజ్. రెస్ట్ తీసుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ సీతారామయ్య చుట్టు చేరుతారు కుటుంబ సభ్యులు. పొద్దున మొదలుపెట్టిన కార్యం ఒకటి అసంపూర్ణంగా ఉండిపోయింది అది రాజ్ పూర్తి చేస్తాడు అంటాడు సీతారామయ్య. అర్థం కాలేదు అంటాడు రాజ్. నీకు నీ భార్య మనసే అర్థం కాలేదు ఇక నా మాటలు ఏం అర్థం అవుతాయి.
 

27

 కావ్యని ఆశీర్వదించకుండా తన వ్రతం పూర్తికాదు, నువ్వు ఆ పని చేయలేదు, నీ పద్ధతి నాకు నచ్చలేదు. వెళ్లి కావ్యని తీసుకువచ్చి ఆశీర్వదించు. లేదంటే ఆమె వ్రతం ఆ సంపూర్ణమైపోతుంది అని చెప్పటంతో చేసేదిలేక తన గదికి వెళ్తాడు రాజ్. అప్పటికే లగేజీతో సిద్ధంగా ఉంటుంది కావ్య. ఇంకా వెళ్లలేదా అని అడగొద్దు, మీకు చెప్పి వెళ్దామని ఆగాను. ఎంతైనా తోటి ప్రయాణికులం కదా అని నిరాశగా చెప్తుంది. ఇన్నాళ్ళు ఓపిక పట్టావు ఇంకొక మూడు నెలలు ఓపిక పట్టు.
 

37

 నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అంటాడు రాజ్. ఈ మూడు నెలల్లో మీరు మారిపోతారా అని అనుమానంగా అడుగుతుంది. అనవసరంగా మళ్ళీ నాలో ఆశలు రేపకండి అని నిరాశగా అంటుంది కావ్య. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం మూడు నెలల్లోనే దొరుకుతుంది. నీకు నమ్మకం కావాలి అంతే కదా అంటూ కావ్యని చేయి పట్టుకుని కిందికి తీసుకువెళ్లి అందరూ చూస్తుండగానే కావ్య ని ఆశీర్వదిస్తాడు రాజ్. నా వ్రతం అసంపూర్ణమై పోతుందేమో అనుకొని బాధపడ్డాను తాతయ్య.
 

47

 మీ వల్లే ఈరోజు  నా వ్రతం పూర్తయింది అనే సీతారామయ్యకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది కావ్య. ఇదంతా చూస్తున్న అపర్ణ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అదే రోజు రాత్రి ఆలోచనలో ఉన్న అపర్ణ దగ్గరికి వచ్చి ఆమె కోపాన్ని మరింత పెంచేలాగా మాట్లాడుతుంది రుద్రాణి. మహారాణి లాగా ఉండే దానివి నీ కోడలు వచ్చిన తర్వాత నీ మాట చెల్లడం లేదు. నీ కొడుకు కావ్య వైపే వెళ్తున్నాడు అంటుంది. నా కొడుకు ఏమి అమాయకుడు కాదు వాడికి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు అంటుంది అపర్ణ.

57

 నా ముందు ఒప్పుకోకపోయినా పర్వాలేదు కానీ నువ్వు ఆలోచించుకో. ముందు ఆశీర్వచనానికి ఒప్పుకొని వాడు తర్వాత భార్య చేతిని పట్టుకొని మరీ కిందికి తీసుకువచ్చి ఆశీర్వదించాడు అంటే దాని అర్థం ఏంటి అంటుంది రుద్రాణి. సమాధానం చెప్పలేక కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ. వదినకి బాగా కాలినట్లుగా ఉంది అని ఆనంద పడిపోతుంది రుద్రాణి. మరోవైపు కృష్ణుడిని వేడుకుంటూ నా భర్త మూడు నెలలు గడువు అడిగాడు.
 

67

మూడు నెలలలో మారితే జీవితమంతా ఆనందమే కదా ఇదంతా నీ మాయే కదా అని ఆనందపడుతుంది కావ్య. కానీ అనుమానంగా ఉంది కృష్ణ..నా భర్త మూడు నెలలలో మారుతాడా.. కాలం నీ చేతిలో ఉంది, సహనం నా చేతిలో ఉంది, నాకు కాపురం నా భర్త చేతిలో ఉంది. ఏ చేతులు కాళీ లేకుండా ఉండేలాగా చూడు. నాకు ఆస్తిపాస్తులు వద్దు నా భర్త మనసులో స్థానం ఉంటే చాలు అవి దక్కేలా చూడు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది  కావ్య. తను దేవుడి దగ్గర నుంచి రావటం గమనించిన రాజ్ కృష్ణుడి దగ్గరికి వెళ్లి కళావతి నీకు చాలా పిటిషన్లు పెట్టుకున్నట్లుగా ఉంది.

77

 మంచి మనసుతో అవన్నీ ఓకే చేసేయ్యకు. నేను తాతయ్య ఆరోగ్యం కోసం లౌక్యం ప్రదర్శిస్తున్నాను, అందుకే మూడు నెలలు గడువు అడిగాను. అది నీకు కూడా తెలుసు అంతేకానీ ఎప్పటికీ ఆ కళావతికి నా మనసులో స్థానం ఉండదు. అలా జరిగేలా చూడు అని చెప్పి రాజ్ కూడా కృష్ణుడికి దండం పెట్టుకుంటాడు. తరువాయి భాగంలో కావ్య తో ఆనందంగా, చొరవగా మాట్లాడుతున్న రాజ్ ప్రవర్తనకి అందరూ ఆశ్చర్యపోతారు. వీడేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటుంది అపర్ణ.

click me!

Recommended Stories