Brahmamudi: ఆవేశంతో కావ్య ఇంటికి బయలుదేరిన అపర్ణ.. ఇంట్లో స్వప్న ని చూసి షాకైన రాజ్!

Published : Apr 15, 2023, 11:32 AM ISTUpdated : Apr 15, 2023, 11:33 AM IST

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తూ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తనకి ఆజన్మ శత్రువు చెల్లెలే అనుకుంటూ ఆమె మీద పగ పట్టిన ఒక అక్క కధ ఈ సీరియల్. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
18
Brahmamudi: ఆవేశంతో కావ్య ఇంటికి బయలుదేరిన అపర్ణ.. ఇంట్లో స్వప్న ని చూసి షాకైన రాజ్!

ఎపిసోడ్ ప్రారంభంలో అప్పు దగ్గర ఫోన్ తీసుకొని కంగారు పడవలసిన అవసరం లేదు పెద్దగా దెబ్బలు ఏమి తగల్లేదు కావ్య కాపురం పెట్టేసరికి తగ్గింది అంటుంది కనకం. మా పెద్దమ్మకి తెలిసిందంటే ఎప్పుడు మీ ఇంటికి పంపించదు అంటాడు కళ్యాణ్. మరేమీ కంగారు పడవలసిన పనిలేదు అని చెప్పటంతో  ఫోన్ పెట్టేస్తాడు కళ్యాణ్. మరోవైపు రాజ్ కి కాపడం పెట్టడం కోసం ఇత్తడి చెంబులో వేడి నీళ్లు తీసుకువస్తుంది కావ్య. దీన్ని మీ ఇంట్లో హాట్ బాగ్ అంటారా అంటాడు రాజ్. 

28

మీరు వేడినీళ్లని  బ్యాగ్ లో పోస్తారు మేము చెంబులో పోస్తాము ఏదైనా పెట్టేది కాపాడమే అంటుంది అప్పు. నా మీద నాటు వైద్యాన్ని ప్రయోగించొద్దు అంటాడు రాజ్. కావ్య నెమ్మదిగా కాపడం పెడుతుంటే ఇదే సరైన సమయంలో బావ లెగిసి ఏమీ అనలేరు.చురక పెట్టు అంటూ గట్టిగా చెంబుని నొక్కుతుంది అప్పు. బాధతో గట్టిగా అరుస్తాడు రాజ్. ఏమైంది అనుకుంటూ కంగారుగా అక్కడికి వస్తారు మీనాక్షి, కనకం. మేమేమి చేయలేదు అంటుంది అప్పు. మీకోసం కషాయం చేసి తీసుకువచ్చాను ఇలాంటి నొప్పులైనా మాయమైపోతాయి అంటుంది మీనాక్షి. నా జాతకమే ఇంత అల్లుడు ఇంటికి వస్తే బోలెడు  మర్యాదలు చేద్దామనుకున్నాను కానీ ఇలా జరిగింది అంటూ గోలపెడుతుంది కనకం.

38

జరిగిన సంగతి రాజ్ వాళ్ళ అమ్మగారికి చెప్పకపోతే మళ్లీ మాయ, మోసం చేశాను అంటారు ఎలాగైనా ఆవిడకి తెలిసేలాగా చేయాలి అనుకుంటుంది కావ్య. రాజ్ కషాయం తాగను అనటంతో బలవంతంగా రాజ్ చేత కషాయం తాగిస్తారు మీనాక్షి వాళ్ళు. కావ్యని చూసుకోమని అందరూ బయటికి వెళ్లిపోతారు. మరోవైపు రాజ్ కి చెప్తే వాళ్ళ అమ్మగారికి చెప్పనివ్వరు అనుకొని ఫోన్ తీసుకుని విషయం చెప్పటానికి బయటికి వెళ్ళిపోతుంది కావ్య. మరోవైపు అత్తగారింట్లో కొడుకు ఎన్ని పాట్లు పడుతున్నాడో అంటూ కంగారు పడిపోతుంది అపర్ణ. వాడు ఇబ్బందిని వాడే భరిస్తుంటే మధ్యలో నువ్వెందుకు నలిగిపోతున్నావు అంటుంది చిట్టి. 

48

వాళ్లు వాడిని మాయ చేసేస్తారు ఇందాక వీడియో కాల్ లో కూడా చూశాను అంటుంది అపర్ణ. ఫోన్ చేస్తాను అన్నవాడు ఇప్పుడు వచ్చి ఫోన్ చేయలేదు అంటూ ఏడుపు మొహం పెడుతుంది. ఇంతలోనే రాజ్ ఫోన్ చేయడంతో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. కానీ రాజు మాట్లాడకుండా కావ్య మాట్లాడటంతో కోప్పడుతుంది. కోప్పడకుండా చెప్పేది వినండి అంటూ జరిగిందంతా చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కావ్య. నా కొడుకుని ఆ నరకంలో నుంచి పంపించారు ఇప్పుడు చూడండి వాడికి దెబ్బ తగిలిందంట మీరే వెళ్లి తీసుకురండి అంటుంది అపర్ణ.
 

58

పెళ్ళాం కొంగు పట్టుకుని వెళ్ళినవాడు నువ్వు పంపించిన వాళ్లతో తిరిగి వస్తాడా అందుకని నువ్వే వెళ్ళు అంటుంది రుద్రాణి. నా కొడుకు కోసమైనా వెళ్తాను అంటూ ఆవేశంగా బయలుదేరుతుంది అపర్ణ. తన ఆవేశాన్ని చూస్తే కంగారుగా ఉంది నువ్వు కూడా తోడు వెళ్ళు అంటూ రుద్రాణిని పంపిస్తుంది చిట్టి. మరోవైపు ఇంటికి వెళ్లే ముందు అమ్మకి ఫోన్ చేసి వెళ్తే మంచిది అనుకుంటుంది స్వప్న. కానీ కావ్య ఇంట్లో ఉంది అమ్మ మనసు మార్చేస్తుందేమో నేరుగా ఇంటికి వెళ్లడమే మంచిది అనుకొని ఇంటికి బయలుదేరుతుంది. 

68

మరోవైపు దోమలతో ఇబ్బంది పడుతున్నాడని దోమతెర కడుతుంది అప్పు. పులి బోనులో బంధించినట్లుగా ఉంది అంటూ తీసేయమని కసురుకుంటాడు రాజ్. బావని తిట్టుకుంటూ దోమతెర విప్పేస్తుంది అప్పు. అదే విషయాన్ని తల్లికి చెప్పటంతో ఆమె గదినిండా మస్కిటో కాయిల్స్ పెడుతుంది. అలాంటివేవీ వద్దు నాకు ఇబ్బంది అనటంతో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కనకం. కాయిల్స్ పొగ బయటికి వెళ్లే దారిలేక గదంతా పరుచుకుంటుంది. ఇబ్బంది పడుతున్న రాజ్ ని అప్పుడే గదిలోకి వచ్చిన కావ్య చూసి పదండి హాల్లోకి వెళ్ళిపోదాం అని చేయి పట్టుకొని హాల్లోకి తీసుకొస్తుంది.

78

 మరోవైపు ఇంటికి వస్తున్న స్వప్నని కారు ఆపి కృష్ణమూర్తి గారి ఇల్లు ఎక్కడ అని అడుగుతుంది అపర్ణ. చున్ని కప్పుకుని ఉండడం వల్ల అపర్ణని గుర్తుపట్టరు వాళ్ళు. అప్పుడే కావ్య తన తెలివితేటలతో అత్తింటి వాళ్ళని పుట్టింటికి రప్పించుకుంటుంది అనుకుంటుంది స్వప్న. స్వప్న ఏమి మాట్లాడకపోవడంతో ఆమెకి తెలుగు రాదేమో అనుకొని వచ్చి రాని హిందీ మాట్లాడుతుంది రుద్రాణి.

88

మా అత్తగారి భాష నా బ్రతుకులాగా అస్తవ్యస్తంగా ఉంది అనుకుంటుంది స్వప్న. తరువాయి భాగంలో అందరూ పడుకున్నాక సప్నని వెతకడానికి ఇదే మంచి టైం అనుకొని మెల్లగా బయటకు వస్తాడు రాజ్. అదే సమయంలో స్వప్న కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇద్దరు ఎదురు పడి ఇద్దరూ షాక్ అవుతారు.

click me!

Recommended Stories