సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్దే డేటింగ్? రూమర్లపై స్పందించిన బుట్టబొమ్మ.. ఏమంటుందంటే?

First Published | Apr 15, 2023, 10:54 AM IST

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde)పై ఇటీవల డేటింగ్ రూమర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం కొనసాగిస్తుందంటూ పుకార్లు వచ్చాయి. దీనిపై పూజా క్లారిటీ ఇచ్చారు.
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక బుట్ట బొమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పూజాపై డేటింగ్ రూమర్లు వినిపిస్తున్నాయి.
 

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) సరసన పూజా హెగ్డే  ‘కిసి కా బాయ్ కిసి కా జాన్’లో నటించిన విషయం తెలిసిందే. ఈనెలలోనే 21న చిత్రం అన్ని భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈక్రమంలో పూజా ఆయా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తోంది.
 


కాగా, Kisi Ka Bhai Kisi Ka Jaan షూటింగ్ సమయంలో ఇద్దరు బాగా దగ్గరయ్యారని, డేటింగ్ కూడా చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. మరోవైపు పూజాను సల్మాన్ ఖాన్ మరోరెండు ప్రాజెక్ట్స్ లలోనూ ఓకే చేసినట్టు ప్రచారం జరగడంతో రూమర్స్ మరింతగా పెరిగాయి. తాజాగా రూమర్లపై బుట్టబొమ్మ స్పందించారు. 
 

పూజా మాట్లాడుతూ.. ‘వాటిపై నేను ఏం చెప్పగలను? ఆ వార్తలను చదివాను. నేను పెద్దగా పట్టించుకోను. కానీ నేను సింగిల్ గానే ఉన్నాను. ప్రస్తుతం కేరీర్ పైనే ఫోకస్ పెట్టాను.  ఇక సల్మాన్ ఖాన్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు. ఆయనతో కలిసి నటించడం గ్రేట్ ఫీలింగ్. ఈ సినిమాలో నేను తెలుగు అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. ఆ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది.’ అని చెప్పుకొచ్చింది. 
 

గత నెలలో మంగళూరులో పూజా హెగ్దే సోదరుడు రిషబ్ హెగ్దే వివాహం జరిగిన విషయం తెలిసిందే.  ఆ వేడుకకు సల్మాన్ ఖాన్ ప్రత్యేకంగా హాజరవడంతో డేటింగ్ రూమర్లకు గట్టిగా వచ్చాయి. అంతకముందు కూడా పుకార్లు వచ్చాయి. ఇక పూజా హెగ్దే స్పందించడంతో మొత్తానికి ఫుల్ స్టాప్ పడింది. 
 

‘కిసి కా బాయ్ కిసి కి జాన్’ చిత్రానికి ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. విక్టరీ వెంకటేశ్, జగపతి బాబు, భూమికా చావ్లా,  షెహనాజ్ గిల్, పాలక్ తివారీ, విజేందర్ సింగ్, రాఘవ్ జుయల్ తదితరలు కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ అపియరెన్స్ ఇవ్వబోతున్నారు. ఏప్రిల్ 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక పూజా హెగ్దే సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన SSMB28లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే.
 

Latest Videos

click me!