2016లో మలయాళంలో విడుదలైన 'మహేషింటే ప్రతికారం' చిత్రంతో అపర్ణ బాలమురళి సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత తమిళంలో 'ఎట్టు తోట్టాక్కల్', 'సర్వం థాల మాయం' వంటి చిత్రాలలో నటించారు. 2020లో సుధా కొంగర దర్శకత్వంలో విడుదలైన 'ఆకాశమే నీ హద్దు ( సూరరై పోట్రు') చిత్రంలో సూర్యకు జంటగా నటించారు. ఈ చిత్రంలో నటనకు గాను ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా లభించింది.