ఏపీ మంత్రి విడదల రజినీ రేర్ ఫోటోలు..ఈమెకి స్పెషల్ క్రేజ్ అందుకే, వైరల్

Published : Apr 07, 2024, 04:36 PM IST

సైబరాబాద్ లో మీరు నాటిన చెట్టు మొక్క సార్ నేను అనే డైలాగ్ తో విడదల రజని సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యారో చెప్పాల్సిన అవసరం లేదు.

PREV
17
ఏపీ మంత్రి విడదల రజినీ రేర్ ఫోటోలు..ఈమెకి స్పెషల్ క్రేజ్ అందుకే, వైరల్

సైబరాబాద్ లో మీరు నాటిన చెట్టు మొక్క సార్ నేను అనే డైలాగ్ తో విడదల రజని సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యారో చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో టిడిపి నేతగా ఉన్న విడుదల రజని ఆయా తర్వాత వైసిపి నేతగా మారారు. 

27

2019లో విడదల రజనీ చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. ఆమె ప్రస్తుతం జగన్ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

37

వాస్తవానికి విడదల రజని పుట్టి పెరిగింది తెలంగాణాలో. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో జన్మించారు రజని. చదువు పూర్తయ్యాక విడదల రజని హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేశారు. 

47

కుమార స్వామి అనే వ్యక్తిని వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు. అక్కడే సాఫ్ట్ వేర్ కంపెనీ స్థాపించారు. ఆర్థికంగా స్థిరపడ్డాక పేదవారికి సాయం చేయాలని ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. 

57

ఆమె టిడిపి నేత ప్రత్తిపాటి పుల్లారావు ప్రమేయంతో రాజకీయాల్లోకి వచ్చారు. టిడిపిలో టికెట్ లభించకపోవడంతో ఆమె వైసీపీలో చేరి పుల్లారావు పైనే పోటీ చేసి విజయం సాధించారు. 

67

విడదల రజని సోషల్ మీడియాలో యాక్టివ్. ప్రజల్లో మమేకమయ్యే దృశ్యాలని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. విడదల రజని ప్రజల్లో బాగా కలసి పోతారు. దీనితో ఆమెకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. 

77

ఎద్దులతో, చీపుర్లు మోస్తూ, ఆటో డ్రైవ్ చేస్తూ, వైఎస్ జగన్ కి రాఖీ కడుతూ ఇలా వివిధ రకాలుగా ఉన్న విడదల రజనీ క్రేజీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

click me!

Recommended Stories