రోజా వల్లే నాగబాబు జబర్థస్త్ ను వీడారా..? వివాదాలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ మంత్రి

Published : Dec 25, 2022, 01:55 PM IST

చాలా కాలం తరువాత జబర్థస్త్ విషయంలో క్లారిటీ ఇచ్చారు మాజీ హీరోయిన్.. ఏపీ మంత్రిరోజ. చాలా కాలంగా సోషల్ మీడియాల్ జరుగుతున్నప్రచారానికి తెర వేశారు. 

PREV
16
రోజా వల్లే నాగబాబు జబర్థస్త్ ను వీడారా..? వివాదాలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ మంత్రి
jabardasth show

ఒక వైపు ఎమ్మెల్యేగా ఉంటూనే దాదాపు దశాబ్ధం పాటు జబర్థస్త్ జడ్జిగా వ్యవహరించారు మాజీ హీరోయిన్ రోజా. ప్రస్తుతం ఆమె మంత్రిగా ఉండటంతో రూల్స్ ప్రకారం జబర్థస్త్ ను వీడక తప్పలేదు. అయితే అంతకు ముందు రెండేళ్ళ క్రితమే నాగబాబు జబర్థస్త్ జడ్డిగా తప్పుకున్నారు.

26

అయితే ఈక్రమంలో ఆయన ఎందుకుజబర్థస్త్ నుంచి బయటకు వచ్చాడో ఒ వీడియోలో క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఆమధ్య నుంచి నాగబాబు జబర్థస్త్ను వీడటానికి కారణం రోజానే అంటూ  కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇద్దరి మధ్య విభేదాల కారణంగానే ఆయన ఈ షోనుంచి బయటకు వెళ్ళారంటూ కామెంట్లు వినిపించాయి. 

36

రోజా వల్లే నాగబాబు జబర్దస్త్ షోకు దూరమయ్యారని కామెంట్లు వినిపిస్తున్న క్రమంలో ఈ కామెంట్ల గురించి స్పందించారు రోజా  క్లారిటీ కూడా ఇచ్చారు. నాగబాబుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, అయన్ని సోషల్ మీడియాల కావాలని పుట్టించిన పుకార్లంటూ కోట్టి పారేశారు.  చాలా సందర్భాల్లో ఆయన నన్ను మొచ్చుకునేవారని రోజా అన్నారు.  

46
jabardasth show

నిర్మాతలను ఇబ్బంది పెట్టని హీరోయిన్ వి నువ్వు అంటూ  నాగబాబు తనను బాగా గౌరవించేవారని  రోజా కామెంట్లు చేశారు. నాగబాబు విషయంలో తాను కూడా చాలా గౌరవంగానే ఉన్నానని రోజా పేర్కొన్నారు. జబర్దస్త్ కు నాగబాబు దూరం కావడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని రోజా  క్లారిటీ ఇచ్చారు. 
 

56

ఇక వీటితో పాటు మరికొన్ని విషయాలు కూడా తన సన్నిహితుల దగ్గర పంచుకున్నట్టు తెలుస్తోంది. వైసీపీని వీడాల్సి వస్తే ఇక రాజకీయాలకు సెలవు చెపుతాను తప్పించి..ఇంకో పార్టీలో చేరబోనంటూ ఆమె క్లారిటీగా చెప్పినట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం ఏపీ టూరిజం మంత్రిగా ఉన్నారు రోజా. 

66
jabardasth show

ఇక దాదాపు 10 సంవత్సరాలు జబర్థస్త్ జడ్జిలుగా షోను సూపర్ సక్సెస్ చేయడంతో కీ రోలో పోషించారు నాగబాబు, రోజా, 2019 లో కొన్ని విబేధాల కారణంగా నాగబాబు షో నుంచి తప్పుకున్నారు. ఆక రీసెంట్ గా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజ ఆ షో నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఇంద్రజ, మనోతో పాటు కృష్ణభగవాన్ మరికొంత మంది గెస్ట్ లతో జబర్థస్త్ ను నడిపిస్తున్నారు. 

click me!

Recommended Stories