ఏపీలో వివిధ శాఖలకు కొత్త మంత్రులు వచ్చారు. కొత్తగా మంత్రులైన వారి గురించి విషయాలు వైరల్ అవుతున్నాయి. వారి ప్రస్థానం.. ఎదిగిన తీరు గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కీలకంగా భావించే ఇరిగేషన్ శాఖకు పార్టీ సీనియర్ నేత, అధికారప్రతినిధి అంబటి రాంబాబు మంత్రిగా వచ్చారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రిగా అంబటి రాంబాబు ఎంపిక అయ్యిన నేపధ్యంలో ఆయన పాత ఫొటోలు సోషల్ మీడియా జనం బయిటకు తీసి షేర్ చేస్తున్నారు.