ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శనివారం రోజు శస్త్ర చికిత్స జరిగింది. సడెన్ గా పవన్ కళ్యాణ్ కి సర్జరీ ఎందుకు చేశారు ? ఎన్ని రోజులు పవన్ కి విశ్రాంతి అవసరం లాంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం ఉదయం తన అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్నారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారంనాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు.
23
పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్స
వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శస్త్రచికిత్స చేశారు. వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఈ వివరాలు తెలియజేస్తూ జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.
33
పవన్ అభిమానులకు ఆందోళన
పవన్ అభిమానులకు ఇది ఆందోళన కలిగించే వార్తే అని చెప్పాలి. ప్రస్తుతం చేసిన శస్త్ర చికిత్స నుంచి పవన్ పదిరోజుల్లో కోలుకోవచ్చు. కానీ ఆ తర్వాత దీర్ఘకాలం పాటు పవన్ జాగ్రత్తలు తీసుకోవాలి అని వైద్యులు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. పవన్ మునుపటిలా యాక్టివ్ గా రాజకీయాలు, సినిమాలు బ్యాలెన్స్ చేయగలరా అనే చర్చ మొదలైంది.