ప్రేమకు మతం అడ్డుకాదని నిరూపించారు కొందరు హీరోయిన్లు. వేరే మతంలో పుట్టినా, పెళ్లి తర్వాత భర్త మతాన్నే స్వీకరించి, వారి సంప్రదాయాలను పాటిస్తున్నారు. నయనతార నుంచి జెనిలియా వరకూ.. ఆ స్టార్ హీరోయిన్లు ఎవరో చూద్దాం.
భర్త కోసం మతం మార్చుకున్న హీరోయిన్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.. వారిలో షర్మిలా ఠాకూర్ ఒకరు. హిందూ కుటుంబంలో పుట్టిన షర్మిలా ఠాగూర్, క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని పెళ్లాడారు. ఇస్లాం మతం స్వీకరించి, తన పేరును 'ఆయేషా సుల్తానా'గా మార్చుకున్నారు. కానీ, సినీ ప్రపంచంలో ఆమె షర్మిలా ఠాగూర్‌గానే ఫేమస్.
28
పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అన్నా లెజ్‌నెవాను పెళ్లి చేసుకున్నారు. అన్నా క్రిస్టియన్ అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో కలిసి హిందూ సంప్రదాయాలను పాటిస్తారు. పవన్ కూడా భార్య మతాన్ని గౌరవిస్తూ.. ఆవిడ పండుగలను కూడా సెలబ్రేట్ చేస్తుంటారు.
38
నయనతార
నయనతార క్రిస్టియన్ కుటుంబంలో పుట్టారు. ఆమె అసలు పేరు డయానా మరియం కురియన్. పెళ్లి తర్వాత ఆమె హిందూ మతంలోకి మారారు. ఇప్పుడు భర్త విఘ్నష్ శివన్‌తో కలిసి హిందూ సంప్రదాయాలను పాటిస్తున్నారు.
టాలీవుడ్ హీరోయిన్ జెనిలీయా.. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా స్టార్ గా వెలుగు వెలిగింది. క్రిస్టియన్ అయిన జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె మరాఠీ సంప్రదాయాలను, హిందూ పండుగలను జరుపుకుంటున్నారు.
58
ఖుష్బూ సుందర్
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది ఖుష్బూ సుందర్. ముస్లిం కుటుంబంలో జన్మించిన ఖుష్బూ, డైరెక్టర్ సుందర్ సిని పెళ్లాడారు. పెళ్లి తర్వాత ఆమె హిందూ మతాన్ని స్వీకరించి, ఆచారాలను పాటిస్తున్నారు.
68
దీపికా కక్కర్
హిందూ మతానికి చెందిన దీపికా కక్కర్, నటుడు షోయెబ్ ఇబ్రాహీంను వివాహం చేసుకున్నారు. తర్వాత ఇస్లాంలోకి మారి, తన పేరును 'ఫైజా'గా మార్చుకున్నారు. కానీ ఇండస్ట్రీలో ఆమె దీపికా కక్కర్‌గానే కొనసాగుతున్నారు.
78
నర్గీస్ దత్
ముస్లిం కుటుంబంలో పుట్టిన నర్గీస్, నటుడు సునీల్ దత్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత హిందూ మతంలోకి మారారు. ఆమె హిందూ పేరు 'సరస్వతీ దేవి'.
88
జ్యోతిక
జ్యోతిక తండ్రి ముస్లిం, తల్లి పంజాబీ. ఆమె తమిళ స్టార్ హీరో సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత హిందూ సంప్రదాయాలను పాటిస్తున్నారు.