Betting Apps: వెయ్యి కోట్ల ఆస్తి ఉండి ఇదేం కక్కుర్తి.? స్టార్‌ కమెడియన్‌కు ఇచ్చి పడేసిన అన్వేష్‌

బెట్టింగ్‌ యాప్స్‌ అంశంపై మొదటి నుంచి పోరు చేస్తున్నాడు ప్రముఖ యూ ట్యూబర్‌ అన్వేష్‌. ప్రపంచ యాత్రికుడు పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ నడిపిస్తున్న అన్వేష్‌ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న వారిని తనదైన శైలిలో అటాక్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్టార్‌ కమెడియన్‌ అలీపై విరుచుకుపడ్డాడు..
 

Anvesh Attacks Comedian Ali Over Betting App Promotions Viral Video in telugu VNR
Anvesh Betting Apps

ప్రస్తుతం టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న అన్వేష్ ఓ మజీద్‌ ముందు చేతిలో ఖురాన్‌ పట్టుకుని మాట్లాడుతూ ఓ వీడియో రూపొందించాడు. ఖురాన్‌ సాక్షిగా ఒక్క బూతు కూడా మాట్లాడుతున్నానంటూ వీడియో మొదలు పెట్టాడు. రూ. వెయ్యి కోట్ల ఆస్తులున్న అలీ, అది కూడా రంజాన్‌ మాసంలో బెట్టింగ్‌ యాప్స్‌ను ఎందుకు ప్రమోట్‌ చేశారంటూ ప్రశ్నించారు? సహాయం పేరుతో చాలా మోసం చేశారంటూ విమర్శించారు. 

Anvesh Attacks Comedian Ali Over Betting App Promotions Viral Video in telugu VNR
Anvesh-vs-Ali


'బాల నటుడిగా కెరీర్ మొదలు పెట్టి వెయ్యి సినిమాల్లో నటించారు. 50 సినిమాల్లో హీరోగా నటించారు. సినిమా రంగంలో 50 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన ఆస్తుల విలువ సుమారు రూ. 1000 కోట్లు ఉంటుంది. అలాంటి వ్యక్తి బెట్టింగ్‌ యాప్స్‌ను ఎందుకు ప్రమోట్‌ చేశాడు' అంటూ ప్రశ్నించాడు. అలీ జనాలను ఎలా మోసం చేశాడో అన్వేష్‌ చెప్పుకొచ్చాడు. 


anvesh

బిర్యానీ మోసం.. 

'అలీ గారి భార్యతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఈ ఛానల్‌కు సుమారు 20 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వీరు కనివినీ ఎరగని విధంగా తెలుగులో బిర్యానీ మోసం చేశారు. రూ. 10 వేలతో చికెన్‌ బిర్యానీ తయారు చేసి కొంతమంది అనాధలకు ఇచ్చారు. అయితే ఈ వీడియోను 50 లక్షల మంది చూశారు. ఈ వీడియో ద్వారా వీరికి యూట్యూబ్‌ సుమారు రూ. 5 లక్షలు ఇచ్చింది. ఇందులో ఏం తప్పులేదు. కానీ ఈ వీడియోలో బెట్టింగ్‌ యాప్‌ను ప్రమోట్‌ చేశారు. అలా ఒక రూ. 20 లక్షలు వసూలు చేశారు. వేల కోట్లు ఆస్తులు ఉండి, సహాయం పేరు ఇలా మోసం చేస్తే అల్లా క్షమిస్తారా.?' అంటూ ప్రశ్నించారు. 
 

Anvesh-latest-video.

బిర్యానీ ప్యాకెట్ల పేరుతో సహాయం చేస్తున్నట్లు నటించి.. బెట్టింగ్‌ యాప్స్‌ నిర్వాహకుల నుంచి డబ్బులు తీసుకోవడం మోసం కాదా అంటూ అన్వేష్‌ విరుచుకుపడ్డాడు. భారతదేశాన్ని దెబ్బ తీయాలని పలు దేశాలు చేస్తున్న కుట్రలో భాగం కావడం ఎంత వరకు సబబు? అంటూ అన్వేష్‌ ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. 

Latest Videos

vuukle one pixel image
click me!