ఇందులో మరికొన్ని విషయాలను పంచుకుంది అనుష్క. ఇప్పుడున్న హీరోయిన్లలో తనకు నచ్చిన హీరోయిన్లు ఎవరు అనే ప్రశ్నకి, త్రిష,నయనతార, అలాగే భూమిక అంటే ఇష్టమని, వాళ్ల నటన, వ్యక్తిత్వం బాగా నచ్చుతుందని పేర్కొంది.దీంతోపాటు మరో సీక్రెట్‌ని వెళ్లడించింది. తాను ఫోన్‌ని సరిగా క్యారీ చేయనని, అదే తన పెద్ద వీక్‌నెస్ అని పేర్కొంది. నాగార్జున గురించి చెబుతూ, ఆయన చాలా పాజిటివ్‌గా, కంఫర్ట్ గా ఉంటారని పేర్కొంది అనుష్క.