MSMP Review: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్విట్టర్ రివ్యూ.. అనుష్క - నవీన్ కాంబో పై ఏమంటున్నారంటే..?

First Published | Sep 7, 2023, 5:56 AM IST

ఐదేళ్ళ తరువాత సిల్వర్ స్క్రీన్ పై 'సందడి చేయబోతోంది అనుష్క శెట్టి..  నవీన్ పోలిశెట్టితో  కలిసి  మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో కనిపించింది. ఈమూవీ ఈరోజు (సెప్టెంబర్ 7న గ్రాండ్ రిలీజ్ అవ్వబోతోంది. ఈలోపు ప్రీమియర్ షోలు పడగా.. ఈ సినిమా చూసిన అభిమానులు తమ అభిప్రాయాలు ట్విట్టర్ ద్వారా  వెల్లడిస్తున్నారు. ఇంతకీ వాళ్లు ఏమంటున్నారంటే..?

నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్క శెట్టి (Anushka Shetty) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (Miss Shetty Mr Polishetty). రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ  సినిమా నేడు (సెప్టెంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. మరి ఈమూవీ చూసిన ఆడియన్స్ సినిమా గురించి ఏమనుకుంటున్నారో ట్విట్టర్ రివ్యూస్ చూద్దాం. 
 

అనుష్క, నవీన్ కాంబో సీన్స్ అద్భుతం అంటున్నారు ట్విట్టర్ జనాలు. నవీన్ పొలిశెట్టి స్టాండప్ కామెడీ సినిమాకు బాగా ప్లాస్ అయ్యింది అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఇక 5 ఏళ్ళ గ్యాప్ తరువాత స్క్రీన్ మీదకు వచ్చిన అనుష్క శెట్టి.. అప్పుడు ఎంత క్యూట్ గా ఉందో.. ఇప్పుడు కూడా అంతే క్యూట్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


5 ఏళ్ళ తరువాత కూడా అనుష్క శెట్టికి నటన మీద గ్రీప్ పొలేదు.. సినిమాలో తన పాత్రలో ఆమె జీవించిందంటూ కామెంట్లు పెడుతున్నారు ఆడియన్స్. అంతే కాదు నటన మీద ఆమెకు ఉన్న ప్రేమను ట్విట్టర్ కామెంట్ల ద్వారా తెగ పొగిడేస్తున్నారు. అటు నవీన్ పాత్ర కూడా అద్భుతంగా ఉంది. కామెడీ టైమింగ్ లో ఏమాత్రం తేడా లేకుండా.. బాగా నవ్వించాడంటున్నారు ప్రేక్షకులు. 

ఇక మరో ట్విట్టర్ కామెంట్ చూసుకుంటే.. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది.. సెకండ్ హాఫ్ అయితే అద్భుతంగా ఉంది.. సినిమా సూపర్ హిట్ అంటూ కామెంట్ పెట్టారు. అంతే కాదు అనుష్క తన పాత్రలో జీవించేసిందంటూ.. రిపిటెడ్ గా స్వీటీ లవ్ యూ అంటూ ట్వీట్లు దర్శనం ఇస్తున్నాయి. అంతే కాదు ఇది హిట్టు బొమ్మ.. దానికి కారణం ఆమె నటన, నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ అంటూ.. తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు జనాలు. 

ఇక ఈసినిమా టెక్నికల్ టీమ్ పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు సోషల్ మీడియా జనాలు.  మరీ ముఖ్యంగా సినిమా మ్యూజrక్ మ్యాజిక్ చేసిందంటున్నారు. అద్భుతమంటూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాకు మ్యూజిక్ కూడా ప్లాస్ అయ్యిందంటున్నారు. అంతే కాదు బీజియం కూడా సీన్ కు తగ్గట్టు ఇచ్చారు... సినిమాలో ప్రతీ సీన్ కు సరిపడా బ్యాగ్రౌండ్ స్కోర్ ఉండబట్టే.. ఆ సీన్ ఇంకా అద్భుతంగా పండిందంటున్నారు. 
 

అయితే అనుష్క ఈసినిమాతో .. కంప్లీట్ గా కమ్ బ్యాక్ అయినట్టేనా..? అన్న అనుమానం ఆమె అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కథ నచ్చబడ్డి సినిమా చేసింది స్వీటి. ఇక ముందు ఇలానే కెరీర్ ను కంటీన్యూ చేస్తుందా..? లేక అప్పుడప్పుడు ఇలాంటి స్టోరీస్ దొరికినప్పుడే ఇలా సినిమాలు చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. 
 

ఇక నవీన్ పోలిశెట్టి కామెండీ మీద నమ్మకం,  అనుష్క కోసం ఆమె ఫ్యాన్స్ ఎదురచూపులు, అసలు వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుంది అన్న క్యూరియాసిటీ. నిజంగా వర్కౌట్ అవుతుందా .. అన్న అనుమానం..? మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాపై అంచనాలు పెంచింది. ఆ అంచనాలు తగ్గట్టే ఆడియన్స్ మనసును దోచుకుంది సినిమా.. రిలీజ్ తరువాత ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. 
 

Latest Videos

click me!