నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ చిత్రం సెప్టెంబర్ 7న నేడు గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. యువ దర్శకుడు మహేష్ బాబు ఈ చిత్రాన్ని రూపొందించాడు. టీజర్స్, ట్రైలర్స్ లో నవీన్ పోలిశెట్టి తన సహజసిద్ధమైన కామెడీ టైమింగ్ తో మెప్పించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.