Jawan special premier review : ‘జవాన్’ ప్రీమియర్ రివ్యూ.. షారుఖ్ ఖాన్ యాక్షన్ మోత.. అట్లీ ఏదీ వదల్లే.!

First Published | Sep 7, 2023, 3:56 AM IST

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న షారుఖ్ ఖాన్ ‘జవాన్’ ప్రీమియర్స్  సందడి మొదలైంది. ఈరోజు ఇండియాలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా స్పెషల్ ప్రీమియర్ ను ప్రదర్శించారు. సినిమాపై పాజిటివ్ టాక్ వస్తోంది. షారుఖ్ కు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవుద్దని తెలుస్తోంది. 
 

బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్, స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)  ఈ ఏడాది ప్రారంభంలోనే ‘పఠాన్’తో భారీ బ్లాక్ బాస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ‘జవాన్’తో థియేటర్లలో సందడి మొదలైంది. గ్రాండ్ స్కేల్లో నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ Jawanకు అట్లీ దర్శకత్వం వహించారు. ఈరోజు (సెప్టెంబర్ 7న) ఇండియాలో భారీ స్థాయిలో విడుదల కానుండగా..  స్పెషల్ ప్రీమియర్ షో ప్రదర్శించారు. అలాగే యూఎస్ లోనూ ప్రీమియర్స్ మొదలయ్యాయి. 
 

ప్రీమియర్ టాక్ ను పరిశీలిస్తే.. షారుఖ్ ఖాన్ కు ఈ ఏడాది మరో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అందినట్టు కనిపిస్తోంది. ఆయన కెరీర్ లోనే ‘జవాన్’ ఊహించని విజయాన్ని అందిస్తుందని ప్రీమియర్స్ ద్వారా తెలుస్తోంది. ప్రీమియర్స్ టాక్ ప్రకారం.. సినిమా ఏ స్థాయిలో అంచనాలను రీచ్ అయ్యిందో తెలుసుకుందాం. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ డ్యూయెల్ రోల్ లో నటించారు. విక్రమ్ రాథోర్, ఆజాద్ రాథోర్ అనే పాత్రల్లో కనిపిస్తారు. ఈ రెండు పాత్రల్లోనూ షారుఖ్ దుమ్ములేపినట్టు తెలుస్తోంది. 
 


ప్రస్తుతం పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. ‘జవాన్’ చిత్రం షారుఖ్ ఖాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ గా నిలిచిపోతుందని అంటున్నారు. జవాన్ సినిమా ఈ ఏడాది ప్రత్యేకంగా నిలిచిపోయేలా ఉందని తెలుస్తోంది. SRK మునుపెన్నడూ లేని విధంగా బిగ్ స్క్రీన్ పై రచ్చ చేశారు. ఉద్వేగభరితమైన సన్నివేశాలు, యాక్షన్ సీన్లతో దుమ్ములేపారని తెలుస్తోంది. షారుఖ్ ప్రతి సీన్ లో ఫ్యాన్స్ కు ఐఫీస్ట్ కలిగించేలా మెరిశారని కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక షారుఖ్ ఖాన్ కు ధీటుగా లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) పవర్ ప్యాక్డ్ యాక్షన్ తో దుమ్ములేపింది. కింగ్ ఖాన్ తో ఆమె కెమిస్ట్రీ బాగుందని ఫిదా అవుతున్నారు. అబ్బురపరిచే యాక్షన్ సీన్స్ తో ఇరగదీశారని తెలుస్తోంది. విలన్ పాత్ర పోషించిన విజయ్ సేతుపతి (Vijay Sethupathi)  కూడా అరగొట్టారని యాక్షన్, కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్లో ఇరగదీశారు.  మిగితా నటీనటులూ పెర్ఫామెన్స్ తో అదరగొట్టారు. దీపికా పదుకొణె క్యామియో అపియరెన్స్ ఆకట్టుకుంటుంది. 
 

దర్శకుడు అట్లీ (Atlee) ‘జవాన్’ సినిమాలో ఏ ఒక్క అంశాన్ని కూడా వదల్లేదు. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు అదిరిపోయే థ్రిల్లింగ్ అంశాలను సరికొత్తగా చూపించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కు ఆడియెన్స్ ఫిదా అవుతారు. పీక్ యాక్షన్ తో కంటిరెప్ప వాల్చకుండా చేశాడని తెలుస్తోంది. స్టార్ పవర్, స్టైల్, స్కేల్, సాంగ్స్,, సర్ప్రైజ్‌లు (క్యామియోస్), ఎమోషన్ తోపాటు ముఖ్యంగా షారుఖ్ ఖాన్ మాస్ అవతార్ వంటి అంశాలను పర్ఫెక్ట్ గా చూపించారు. పుష్కలమైన థ్రిల్, ట్విస్టులు, సస్పెన్స్ తో సినిమా సాగిందని తెలుస్తోంది. బిగ్గెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో పాటు మరో మూడు గూస్ బంప్స్ మూమెంట్ ఉండటం సినిమాపై ఉన్నఅంచనాలను రీచ్ అయ్యేలా చేసింది. 

ముఖ్యంగా అనిరుధ్ అందించిన మ్యూ.జిక్ సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో థియేటర్లు బద్దలనే తెలుస్తోంది. ‘జిందా బందా హో’ సాంగ్ సమయంలో హాల్ మొత్తం ఊగిపోయే పరిస్థితి ఉంది. అద్భుతమైన కథ తోపాటు స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ అదిరిపోయాయి. ఎమోషన్, రొమాన్స్ మరియు  మాస్ యాక్షన్ ను కలిసి అట్లీ ఓ మాస్టర్ పీస్‌ను అందించారని అంటున్నారు. సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుందని, కలెక్షన్ల పరంగా ‘పఠాన్’ లెక్కల్ని దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ బ్యానర్ పై గౌరీ ఖాన్ నిర్మించారు. నయనతార హీరోయిన్. విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషించారు. మరికొద్ది గంటల్లోనే ఇండియా మొత్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 

Latest Videos

click me!