అనుష్క శెట్టి తెలుగు తెర స్వీటీగా రాణిస్తుంది. తెలుగు ఆడియెన్స్ ఆమెని ముద్దుగా `స్వీటీ` అని పిలుచుకుంటారు. అంతటి స్వీటి మనస్తత్వం ఆమెది. నటిగానూ అంతేబాగా చేస్తుంది. `అరుంధతి`, `బాహుబలి`, `భాగమతి` వంటి చిత్రాలతో నిరూపించుకుంది. ఇటీవల `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`తోనూ సందడి చేసింది. కొత్తగా అనుష్క మరే సినిమాని ఒప్పుకోలేదు.
సినిమాలతోనే కాదు, మామూలుగా కూడా అనుష్క బయట కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ హోటల్‌లో మెరిసింది. అయితే తనని ఎవరూ గుర్తు పట్టకుండా ఆమె మాస్క్ ధరించింది. మరోవైపు ఫుడ్ డ్రెస్ వేసుకుని పైన డెనిమ్ జాకెట్ ధరించింది. తనని ఎవరూ గుర్తు పట్టకుండా, అదే సమయంలో తన వెయిట్‌ని కవర్ చేసుకునేలా ఆమె దుస్తులు ధరించి కనిపించడం విశేషం.
అంతేకాదు బయటకు వచ్చిన ఆమె కెమెరాలతో తనని బంధిస్తున్నారని తెలిసి వెంటనే ఫాస్ట్ గా వెళ్లిపోయింది. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అనుష్క లావుగా కనిపిస్తుంది. కానీ లుక్ మాత్రం కనిపించకుండా మ్యానేజ్ చేసింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు ఆ డైరెక్టర్‌ని తిట్టుకుంటున్నారు.
దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి.. `సైజ్ జీరో` చిత్రాన్ని తెరకెక్కించారు. బరువు పెరగడం, తగ్గడమనే కాన్సెప్ట్ తో, క్యాలరీలు కరిగిస్తూ ఎనర్జీని, పవర్‌ని జనరేట్ చేయాలనే కాన్సెప్ట్ తో ఈ మూవీని తెరకెక్కించాడు. ఇందులో చాలా మంది స్టార్లని భాగం చేశాడు. కానీ సినిమా పెద్ద డిజాస్టర్. అసలు దీన్నొక సినిమాగానే కన్సిడర్ చేసేందుకు ఆడియెన్స్, క్రిటిక్స్ ఇష్టపడలేదు. దీంతో అనుష్క పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరులా మారింది.
నిజానికి `సైజ్‌జీరో` కోసం అనుష్క చాలా కష్టపడింది. బాగా బరువు పెరిగింది. ఉభకాయురాలిగా కనిపించింది. ఆ తర్వాత వెంటనే బరువు తగ్గింది. అయితే ఇదంతా మేకప్‌తో కాకుండా ఆమె రియల్‌గా చేసింది. నిజంగానే ఫుడ్ తీసుకుని అధిక బరువు పెరిగింది. ఆ తర్వాత నిజంగానే తగ్గింది. ఈ సందర్బంగానే అనుష్కకి హెల్త్ సమస్యలు ప్రారంభమయ్యాయి. ఆమె బరువు కంట్రోల్ కావడం లేదు. అది అనారోగ్యానికి కారణమవుతుంది. బరువు తగ్గలేకపోవడంతో అనుష్క బయటకు రావడం మానేసింది.
`మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` సినిమాకి ముందు నుంచే అనుష్క బయట కనిపించడం తగ్గించింది. ఇంకా చెప్పాలంటే `భాగమతి` తర్వాత ఆమె మీడియాకి దూరంగా ఉంటుంది. పూర్తి ప్రైవేట్ లైఫ్‌కే పరిమితమయ్యింది. తన సినిమా ప్రమోషన్స్ లోనూ పాల్గొనడం లేదు. కారణం ఆమె ఆరోగ్య సమస్యలే. స్వీటి అధిక బరువుతో బాధపడుతుంది. దాన్ని ఓవర్ కమ్ చేయలేకపోతుంది. దీంతో సినిమాలు కూడా తగ్గించింది. బయట కనిపించేందుకు కూడా ఆమె ఇష్టపడటం లేదు.
కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో ఓ నటికి ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా అత్యంత బాధాకరం. వారికి మాత్రం ఓ నరకం. ఓ చెత్త సినిమా కారణంగా తన కెరీర్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి రావడం బాధాకరం. దీనికి కారణం మాత్రం ఆ దర్శకుడే అని ఆమె అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. దాని కారణంగానే ఆమె ఇప్పుడు కెమెరా కంట పడకుండా దాచుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. మరి దీన్నుంచి ఆమె ఎప్పుడు బయటపడుతుందో ఏంటో.