టాలీవుడ్ ఓ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న హీరో శర్వానంద్ వరుస చిత్రాలతో రాణిస్తున్నారు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా శర్వానంద్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా శర్వానంద్ చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అదే సమయంలో శర్వా యువత మెచ్చే లవ్ స్టోరీస్ కూడా చేస్తుంటాడు.
గత ఏడాది శర్వానంద్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రక్షిత రెడ్డి అనే యువతితో శర్వానంద్ వివాహం జరిగింది. ప్రస్తుతం శర్వానంద్ తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. మంచు మనోజ్ హోస్ట్ గా ఉస్తాద్ అనే షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకి టాలీవుడ్ నుంచి యువ సెలెబ్రిటీలు, హీరోలు హాజరవుతున్నారు.
సిద్దు జొన్నలగడ్డ, నాని, రవితేజ, అడివి శేష్ ఆల్రెడీ అతిథులుగా హాజరయ్యారు. తాజాగా ఈ షోకి శర్వానంద్ హాజరయ్యారు. శర్వానంద్, మంచు మనోజ్ మధ్య సంభాషణ సరదాగా సాగింది. శర్వానంద్ ఫ్యామిలీ మాన్ అంటూ మంచు మనోజ్ అభివర్ణించాడు.
అనంతరం మంచు మనోజ్ శర్వానంద్ ఆస్తులపై వేసిన సెటైర్ నవ్వులు పూయించింది. టాలీవుడ్ రిచెస్ట్ హీరోల్లో శర్వానంద్ ఒకడు. కానీ శర్వానంద్ ని చూస్తే ఎప్పుడూ సింపుల్ గా కనిపిస్తుంటాడు. హైదరాబాద్ లో శర్వానంద్ కి భారీగా ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్ లో చాలా ఏరియాల్లో కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్స్ శర్వానంద్ కి ఉన్నాయట.
Manchu Manoj
ఓ ఇంటర్వ్యూలో హైదరాబాద్ లో ఎక్కడ చూసినా అది మా ప్రాపర్టీనే అని శర్వానంద్ చెబుతుంటాడు అంటూ ఇండస్ట్రీలో కొందరు అంటుంటారు.. నిజమేనా అని ప్రశ్నించగా.. అంత కాకపోయినా మేము బాగానే ధనవంతులం అని గతంలోనే శర్వానంద్ తెలిపాడు. తాతగారి నుంచి, తల్లిదండ్రుల నుంచి శర్వానంద్ కి ఆస్తులు బాగానే వచ్చాయి.
నీ రియల్ లైఫ్ లో ఉస్తాద్ ఎవరు అని మంచు మనోజ్ శర్వాని ప్రశ్నించాడు. మా తాత గారే అని శర్వా బదులిచ్చాడు. ఎందుకు బాగా ల్యాండ్స్ ఇచ్చాడనా అంటూ సెటైర్ వేశాడు. అనంతరం శర్వానంద్.. చిరంజీవి, రాంచరణ్ తో కలసి ఉన్న ఫోటోని మనోజ్ చూపించాడు. దీనిపై శర్వా స్పందిస్తూ రాంచరణ్ లాంటి ఫ్రెండ్ నాకు ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు.