'యానిమల్' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించినట్టే.. విమర్షలు కూడా అదే రేంజ్ లో ఎదుర్కొన్నాడు సందీప్. బాలీవుడ్ నుంచి, టాలీవుడ్ నుంచే కాదు.. సినిమా వాళ్లు చాలా మంది ఈసినిమా గురించి కాస్త నెగెటీవ్ గా మాట్లాడారు.
Sandeep Reddy Vanga,
ఈ విషయాల గురించి అనేక సార్లు స్సందించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా..బాలీవుడ్ ను గట్టిగా విమర్షిస్తూ వచ్చారు. స్టార్స్ కు కూడా కౌంటర్లు వేస్తూ.. సంచలనం సృష్టించారు. ఈక్రమంలో ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ బాలీవుడ్ నటి కంగన రనౌత్ తో పని చేయాలనుకుంటున్నట్టు చెప్పగా, దానికి కంగనా షాకింగ్ రెస్పాన్స్ ఇచ్చింది. ఇదే అదనుగా తీసుకుని సందీప్ ను ర్యాగింగ్ చేసింది కంగనా.
రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన 'యానిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 900 కోట్ల వరకు వసూలు చేసి బాలీవుడ్ లో ఒక సంచలనం రేపింది. ఈ సినిమా బాగుందని కొందరు అంటే, విమర్శలు కూడా చాలా ఎక్కువగానే వచ్చాయి. ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో ఉండగానే, ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను చూసిన చాలామంది సెలెబ్రిటీలు ఈ సినిమా ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక వారందరికి సందీప్ రెడ్డి వంగా.. ఒక ఛానెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా ఈ సినిమాని విమర్శించారు. ఈ విషయంలో మాత్రం సందీప్ కాస్త పాజిటీవ్ గా స్పందించారు.
సందీప్ వంగా మాట్లాడుతూ ఆమె ప్రతిభ గల నటి అని, 'క్వీన్' సినిమాలో ఆమె చేసిన నటనకి ప్రశంసించాలని, ఆమె మంచి నటి అని ఆమెతో పనిచేయాలని అనుకుంటున్నాని చెప్పాడు సందీప్. ఆమె ఒకే అంటే కథని వినిపిస్తాను అని కూడా చెప్పాడు. ఇక ఈ ఇంటర్వ్యూ చూసిన కంగనారనౌత్.. ఆ వీడియో క్లిప్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. సందీప్ ను ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేసింది.
నేను నీతో పనిచేయాలని అనుకోవటం లేదని కరాఖండీగా చెప్పేసింది కంగనా రనౌత్. తన సినిమాల గురించి, తన పని గురించి సందీప్ వంగా మాట్లాడిన మాటలకి అతనికి గౌరవం ఇస్తూనే, చాలా క్లియర్ గా తనకి ఎటువంటి పాత్ర అతని సినిమాలో ఆఫర్ చెయ్యొద్దని చెప్పేసారు కంగన. ఎందుకంటే అతని 'యానిమల్' లో అంతా మగవాళ్ల ఆధిపత్యం, ఆడవాళ్ళని కించపరిచే విధంగా వుండే సన్నివేశాలు ఉన్నాయని చెప్పారు కంగన.
తన గురించి మాట్లాడిన సందీప్ కు రెస్పెక్ట్ ఇస్తూనే..వృత్తిపరంగా మాత్రం సందీప్ రెడ్డి వంగాతో కలిసిపని చెయ్యడానికి అఇష్టం చూపించింది కంగనా. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో రకరకాలుగా స్పందిస్తున్నారునెటిజన్లు.