Anushka Shetty: ఆ రెండు సంఘటనలతో అనుష్క పేరు మార్చేసుకుంది.. తెలుసా ?

pratap reddy   | Asianet News
Published : Nov 07, 2021, 04:00 PM IST

సౌత్ లో అనుష్క లేడి సూపర్ స్టార్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సొంతం చేసుకున్న అనుష్క ఎన్నో తిరుగులేని చిత్రాల్లో నటించింది. 

PREV
17
Anushka Shetty: ఆ రెండు సంఘటనలతో అనుష్క పేరు మార్చేసుకుంది.. తెలుసా ?

సౌత్ లో అనుష్క లేడి సూపర్ స్టార్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సొంతం చేసుకున్న అనుష్క ఎన్నో తిరుగులేని చిత్రాల్లో నటించింది. అనుకోకుండా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అనుష్క అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ స్థాయికి ఎదిగింది. 

27

2005లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ అనుష్కని హీరోయిన్ గా పరిచయం చేశాడు. ఆ చిత్రం ఆశించిన రేంజ్ లో ఆడకపోయినా Anushka Shetty గ్లామర్ యువతని మంత్రముగ్దుల్ని చేసింది. ఆ చిత్రం తర్వాత అనుష్కకి ఎప్పుడూ వెనుదిరి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. విక్రమార్కుడు, చింతకాయల రవి ఇలా వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో అనుష్కని అవకాశాలు వరించాయి. 

37

అందచందాలతో ఉర్రూతలూగించిన అనుష్క నటనలో కూడా తాను నెంబర్ 1 అని నిరూపించుకునేందుకు ఎంత కాలం పట్టలేదు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరుంధతి' చిత్రం అనుష్క కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఆ మూవీలో అనుష్క ద్విపాత్రాభినయంలో నట విశ్వరూపం చూపించింది. సౌత్ లో లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు ఊతమిచ్చిన మూవీ అరుంధతి. 

47

అరుంధతి తర్వాత అనుష్కకి సోలోగా స్టార్ హీరోల రేంజ్ లో మార్కెట్ ఏర్పడింది. ఓ వైపు కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేస్తూనే మరో వైపు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ వచ్చింది. ఆ క్రమంలో Bahubali చిత్రంతో అనుష్క ఖ్యాతి దేశవ్యాప్తంగా వ్యాపించింది. అనుష్కని ప్రధాన పాత్రలో పెట్టి దర్శకుడు గుణశేఖర్ భారీ బడ్జెట్ లో రుద్రమదేవి చిత్రం తెరేక్కించారంటే అనుష్క సత్తా ఏంటో అర్థమవుతుంది. 

 

57

అనుష్క నేడు తన 40 వ జన్మదిన వేడుకలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె గురించి ఎన్నో ఆసక్తికర విషయాలని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అనుష్కని మనమంతా ముద్దుగా స్వీటీ అని పులుచుకుంటాం. కానీ ఆమె అసలు పేరు అదే. అనుష్క పేరు స్వీటీ శెట్టి. కాలేజీ అడ్మిషన్ లో స్వీటీ శెట్టి అని రాస్తే.. ముద్దు పేరు కాదమ్మా.. అసలు పేరు రాయాలి అని అన్నారట. 

67
In an interview, actress Anushka Shetty has put an end to all rumours regarding her wedding

ఇక సినిమాల్లోకి వచ్చాక 23 ఏళ్ల యంగ్ ఏజ్ లో స్వీటీ అని పిలవాలంటే ఏదోలా ఉంది అని సెట్ లో అన్నారట. దీనితో అనుష్క ఆలోచనలో పడింది. తనకు తానుగా అనుష్క అని పేరు మార్చుకుంది. కానీ ఆ పేరుకి అలవాటు పడడానికి అనుష్కకి చాలా సమయం పట్టిందట. కానీ రాజమౌళి లాంటి అగ్ర దర్శకులు అనుష్కని స్వీటీ అనే పిలుస్తారు. 

77

ఇక అనుష్క పెళ్లి గురించి చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. మరి అనుష్క పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కుతుందో క్లారిటీ లేదు. ఆమె ఇంకా సినిమాలు చేసే ఆలోచనలోనే ఉన్నట్లుంది. యువీ క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క కొత్త చిత్రాన్ని నేడు ప్రకటించారు. 

Read more Photos on
click me!

Recommended Stories