అనుష్క శెట్టి సౌత్ లో లేడీ సూపర్ స్టార్. బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోవడమే కాదు సోలో హీరోయిన్ గా అనేక చిత్రాల్లో నటించి సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది. అనుష్క చిత్రాలు స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా రాణించాయి. ఒక వైపు కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ ప్రదర్శిస్తూ, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో రాణించడం అనుష్కకి మాత్రమే చెల్లింది.