`పుష్ప 2` దెబ్బకి `హాలీవుడ్‌ రిపోర్టర్‌`పైకి అల్లు అర్జున్‌.. ఈ అరుదైన ఘనత సాధించిన ఏకైక హీరో

Published : Feb 20, 2025, 08:20 AM IST

Allu Arjun: అల్లు అర్జున్‌కి అరుదైన ఘనత సాధించారు. ఇండియాలో ఏ హీరోకి దక్కని అరుదైన గౌరవం ఆయనకు దక్కింది. ఇండియా తొలి స్టార్‌గా బన్నీ రికార్డు సృష్టించారు. ఆ కథేంటో ఇందులో చూద్దాం. 

PREV
15
`పుష్ప 2` దెబ్బకి `హాలీవుడ్‌ రిపోర్టర్‌`పైకి అల్లు అర్జున్‌.. ఈ అరుదైన ఘనత సాధించిన ఏకైక హీరో
allu arjun on the hollywood reporter magazine

Allu Arjun: ఒక్క సినిమాతో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ లైఫ్‌ టర్న్ తీసుకుంది. `పుష్ప 2` సినిమా బన్నీ కెరీర్‌ని మలుపు తిప్పేసింది. అది మామూలు మలుపు కాదు, సంచలనాలకు కేరాఫ్‌గా మార్చింది. `పుష్ప 2` సినిమా ఇండియన్‌ బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలచిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ.1871కోట్లు వసూలు చేసినట్టు టీమ్‌ లేటెస్ట్ గా ప్రకటించింది. 

25
allu arjun on the hollywood reporter magazine

ఈ సినిమాతో ఇండియా వైడ్‌గానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అల్లు అర్జున్‌ చర్చనీయాంశం అయ్యారు. ఈ క్రమంలో తాజాగా బన్నీకి అరుదైన గౌరవం దక్కింది. ఈ అరుదైన గౌరవం సాధించిన తొలి ఇండియన్‌ హీరోగా అల్లు అర్జున్‌ నిలిచారు. మరి ఇంతకి బన్నీ ఏం సాధించాడంటే, ఆయన ప్రముఖ అంతర్జాతీయ మేగజీన్‌ `ది హాలీవుడ్‌ రిపోర్టర్‌` పైకి ఎక్కారు.

ఈ మేగజీన్‌ ఇండియాలో కొత్తగా ఎడిషన్‌ స్టార్ట్ చేసింది. `ది హాలీవుడ్‌ రిపోర్టర్‌ ఇండియా` పేరుతో ఈసంచికని ఇటీవలే ప్రారంభించింది. ఇందులో మొదటి కవర్‌ పేజీపై అల్లు అర్జున్‌ ముఖచిత్రంతో తీసుకురావడం విశేషం.  
 

35
allu arjun on the hollywood reporter magazine

ఈ ప్రతిష్టాత్మక మేగజీన్‌ ఫస్ట్ ఇండియా ఎడిషన్‌లోనే అల్లు అర్జున్‌ ఫోటోని ప్రచురించడం విశేషం. ఆయన ఇంటర్వ్యూని ఇందులో ప్రత్యేకంగా ప్రచురించారు.

`అల్లు అర్జున్‌ః ది రూల్‌` పేరిట ఈ కవర్‌ పేజీ కథనాన్ని రూపొందించారు. అల్లు అర్జున్‌ చేసిన `పుష్ప 2` సినిమా హిందీ సినిమా చరిత్రని తిరగరాసిందని ఇందులో పేర్కొంది. అల్లుఅర్జున్‌ని స్టార్‌ ఆఫ్‌ ఇండియాగా అభివర్ణించింది.
 

45
allu arjun on the hollywood reporter magazine

బన్నీ ఇండియన్‌ సినిమా ముఖచిత్రాన్ని మార్చేశారని, అలాగే ఆయన తనకు తాను 5.5 రేటింగ్ ఇచ్చుకున్నట్టుగా కవర్‌పేజీపై ప్రచురించింది. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. మొత్తంగా ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఇండియన్‌ యాక్టర్‌గా అల్లు అర్జున్‌ నిలవడం విశేషం.

`పుష్ప 2` దెబ్బకి లెక్కలన్నీ మారిపోయాయని చెప్పొచ్చు. ఈ అరుదైన గౌరవంతో బన్నీ జాతీయంగానే కాదు, అంతర్జాతీయంగానూ మంచి క్రేజ్‌, ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
 

55
pushpa 2 final box office collection allu arjun fahadh faasil sukumar

ఇక `పుష్ప 2` వంటి సంచలనాల తర్వాత ఇప్పుడు బన్నీ అట్లీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. త్రివిక్రమ్‌తోనూ సినిమా ఉంది. అయితే ఈ రెండింటిలో ఏది ముందు ప్రారంభమవుతుందనేది క్లారిటీ రావాల్సి ఉంది. అట్లీ సినిమానే ఫస్ట్ ప్రారంభమవుతుందని తెలుస్తుంది. ఇందులో జాన్వీ కపూర్‌ని హీరోయిన్‌గా అనుకుంటున్నారు.

ఇక అల్లు అర్జున్‌ పుష్పరాజ్‌ గా సంచలనం సృష్టించిన `పుష్ప 2` సినిమాకి సుకుమార్‌ దర్శకత్వం వహించగా, ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేసింది. ఫహద్‌ ఫాజిల్‌, జగపతిబాబు, రావు రమేష్‌, అనసూయ, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. 

read  more:Allu Arjun: రామ్‌ చరణ్‌ హీరోయిన్‌తో అల్లు అర్జున్‌ రొమాన్స్, పోటీ కోసం దించిన కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ ?

also read: అనుష్క శెట్టి నటించిన ఏకైక సీరియల్‌ ఏంటో తెలుసా? అస్సలు ఊహించరు.. అంతా నాగార్జున, రాజమౌళి పుణ్యమే!

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories