ఇదిలాఉంటే అకీరా నందన్ హీరోగా ఎంట్రీకి సంబంధించి ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆయన హీరోగా పరిచయానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే నిర్మాతలు క్యూ కడుతున్నారని తెలిసింది. అయితే నిర్మాణ బాధ్యతలు సితార ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత నాగవంశీకి అప్పగించారట పవన్.
అలాగే హీరోగా పరిచయం చేసే బాధ్యతలను దర్శకుడు త్రివిక్రమ్ కి అప్పగించారట. త్రివిక్రమ్, నాగవంశీ, సితార అంతా ఒకే కాంపౌండ్. అది పవన్‌కి సొంత బ్యానర్‌గా భావించే కాంపౌండ్ కావడం విశేషం. అందుకే అకీరా బాధ్యతలను వారికే అప్పగించారట పవన్.