‘టిల్లు స్క్వేర్’ కోసం అనుపమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? పెంచేసిందిగా..

First Published | Jun 10, 2023, 10:25 AM IST

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran)  ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి యంగ్ బ్యూటీ తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గ్గా మారింది. 
 

తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ప్రస్తుతం జోరు మీద ఉంది. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో ఆడియెన్స్ ను అలరిస్తోంది. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది. చివరిగా ‘కార్తీకేయ 2’తో  ఈ ముద్దుగుమ్మ భారీ సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘18 పేజెస్’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
 

ఇలా సక్సెస్ బాటలోనే నడుస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం డీజే టిల్లు స్క్వేర్ (Dj Tillu Square) చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. గతేడాది సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘డీజే టిల్లు‘ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ ను సొంతం చేసుకుంది.
 


దీంతో ఈ అవుట్ అండ్ అవుడ్ కామెడీ అండ్ రొమాన్స్  చిత్రానికి సీక్వెల్ ను కూడా అనౌన్స్  చేశారు. హీరోయిన్ గా అనుపమా పరమేశ్వరన్  ఫైనల్ అయ్యింది. ఇక రీసెంట్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్  వచ్చింది. రొమాంటిక్ పోస్ యూత్ లో ఆసక్తికరంగా మారింది. 
 

అయితే, అనుపమా పరమేశ్వరన్ సక్సెస్ బాటలో నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో Tillu Squareలో నటించేందుకు అనుసమా తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గ్గా మారింది. టిల్లుతో రొమాన్స్ చేసేందుకు ఈ ముద్దుగుమ్మ ఏకంగా 1.25 కోట్లు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. 
 

అయితే గతేడాది వరకు అనుపమా చాలా తక్కువే పారితోషికం అందుకుంది. ఈ చిత్రం నుంచే డిమాండ్ చేయడం ప్రారంభించిందని అంటున్నారు. ఈ వార్తలపై అధికారిక ప్రకటన లేదు. గతంలో ‘రౌడీ బాయ్స్’ చిత్రంలో లిప్ లాక్ చేసి ఆశ్చర్యపరిచిన ఈ ముద్దుగుమ్మ ఈసారి రొమాన్స్ తో ఆకట్టుకోనుంది. ఈ చిత్రంతో అనుపమా నెక్ట్స్ లెవల్ కు వెళ్లనుందని కూడా అంటున్నారు. 
 

ఇక టిల్లు స్క్వేర్ చిత్రాన్ని సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 15న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఇక అనుపమా ఈ చిత్రంతో పాటు మలయాళంలో ఓ చిత్రం, తమిళంలో సైరెన్, తెలుగులో ‘ఈగల్‘ అనే చిత్రంలో నటిస్తోంది. 

Latest Videos

click me!