Latest Videos

బ్లాక్ డ్రెస్ లో అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ మెరుపులు.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్ 

First Published May 27, 2024, 1:17 PM IST

అనుపమ పరమేశ్వరన్ చివరగా టిల్లు స్క్వేర్ చిత్రంతో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ మూవీతో అనుపమ మరో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.

అనుపమ పరమేశ్వరన్ చివరగా టిల్లు స్క్వేర్ చిత్రంతో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ మూవీతో అనుపమ మరో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అనుపమ బోల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. 

గతంలో తెలుగు ఆడియన్స్ చూసిన అనుపమ వేరు.. ఈ చిత్రంలో కనిపించిన అనుపమ కంప్లీట్ గా వేరు. రొమాన్స్, గ్లామర్ షోతో ఈ చిత్రంలో అనుపమ యువతని ఉర్రూతలూగించింది. 

మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అచ్చ తెలుగు అమ్మాయి తరహాలో ప్రేక్షకులని ఆకట్టుకుంది. నటన పరంగా అనుపమకి వంకలు పెట్టలేం. అంతటి చక్కటి అభినయం గల నటి ఆమె. 

శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి చిత్రాల్లో అనుపమ నటించింది.  కార్తికేయ 2 చిత్రంలో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.

 తాజాగా అనుపమ సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలు షేర్ చేసింది. అనుపమ మోడ్రన్ డ్రెస్ లతో పాటు సాంప్రదాయ వస్త్రధారణలో కూడా మెరిసిపోవడం చూస్తూనే ఉన్నాం.   

తాజాగా అనుపమ బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతూ ఇస్తున్న ఫోజులు తెగ వైరల్ అవుతున్నాయి. చిరునవ్వులు చిందిస్తూ అనుపమ ఆకట్టుకుంటోంది. వెరైటీ గా ఉన్న బ్లాక్ డ్రెస్ లో అనుపమ మెరిసిపోతోంది. 

అనుపమ టాలీవుడ్ లో మీడియం రేంజ్ చిత్రాలకు క్వీన్ గా మారింది. మంచి ఆఫర్స్ అందుకుంటోంది. ఇదిలా ఉండగా ఓ సందర్భంలో అనుపమని కూడా దురదృష్టం వెంటాడింది. మొదట 'రంగస్థలం' చిత్రంలో అనుపమనే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరకు అవకాశం ఆమె చేజారింది. 

click me!