Latest Videos

ఒకప్పుడు రూ. 500 కోసం హోటల్ లో పని చేసిన అమ్మాయి ఇప్పుడు కోట్లు తీసుకునే హీరోయిన్!

First Published May 27, 2024, 1:07 PM IST


ఎవరి కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చెప్పలేము. కేవలం రూ. 500 కోసం ఓ హోటల్ పని చేసిన అమ్మాయి ఇప్పుడు దేశంలోని టాప్ హీరోయిన్స్ లో ఒకరు. సినిమాకు నాలుగు కోట్లకు పైగా తీసుకుంటుంది. 
 

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో పుట్టిన ఓ అమ్మాయి  ఎలాంటి నేపథ్యంలో లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. వరుస విజయాలతో టాప్ పొజీషన్ కి చేరింది. లక్కీ హీరోయిన్ ట్యాగ్ సొంతం చేసుకుంది. చిన్నప్పటి నుండే ఒకరిపై అదరపడకూడదనే తత్త్వం అలవరుచుకుంది.

ఆమె ఎవరో కాదు హీరోయిన్ సమంత. చెన్నై లో పుట్టి పెరిగిన సమంత చదువుకునే రోజుల్లోనే సొంత సంపాదన మొదలుపెట్టింది. మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుని చిన్న చిన్న యాడ్స్ లో నటించింది. అలా వచ్చిన డబ్బులు తన పాకెట్ మనీగా వాడుకునేదట. 
 

సమంత ఒకసారి హోటల్ లో హోస్ట్ గా చేసిందట. అందుకు గాను సమంతకు రూ. 500 ఇచ్చారట. అదే తన తొలి సంపాదన అట. ఈ విషయాన్ని సమంత ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకప్పుడు కేవలం ఐదు వందల రూపాయలకు పని చేసిన సమంత ఇప్పటి రేంజ్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

ఆమె సినిమాకు రూ. 4 నుండి 5 కోట్లు తీసుకుంటుంది. అన్ని భాషల్లో ఆమెకు గుర్తింపు ఉంది. మరోవైపు డిజిటల్ సిరీస్లు కూడా చేస్తూ సత్తా చాటుతుంది. ది ఫ్యామిలీ మాన్ 2లో సమంత ఛాలెంజింగ్ రోల్ చేసింది. నెక్స్ట్ హనీ బన్నీ సిరీస్ తో ప్రేక్షకులను అలరించనుంది. 


ఇక సమంత కెరీర్ చూస్తే దర్శకుడు గౌతమ్ మీనన్ వాసుదేవ్ ఏమాయ చేసావే చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. 2010లో విడుదలైన ఏమాయ చేసావే సూపర్ హిట్. బృందావనం, దూకుడు చిత్రాలతో వరుస హిట్స్ నమోదు చేసింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరి సరసన సమంత నటించింది. 

యూ టర్న్, ఓ బేబీ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా విజయాలు అందుకుంది. సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం టైటిల్ తో ఒక చిత్రం చేస్తుంది. ఈ చిత్రంలో ఆమెదే ప్రధాన పాత్ర. మా ఇంటి బంగారం చిత్రానికి సమంత నిర్మాత కూడాను. సమంతకు సాకీ పేరుతో ఓ గార్మెంట్ బ్రాండ్ కూడా ఉంది. 

click me!