ఫైమాని ఆడేసుకున్న నూకరాజు, నవ్వించి ఏడిపించేశాడుగా.. తెలంగాణ ఉద్యమం గురించి అందరి ముందు ఇలా..

First Published May 27, 2024, 12:48 PM IST

జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో కూడా ఇదే తరహా కామెడీ ఉంటోంది. హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్, ఆటో రాంప్రసాద్ లాంటి వారు శ్రీదేవి డ్రామా కంపెనీలో సైతం నవ్వులు పూయిస్తున్నారు.

జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో కూడా ఇదే తరహా కామెడీ ఉంటోంది. హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్, ఆటో రాంప్రసాద్ లాంటి వారు శ్రీదేవి డ్రామా కంపెనీలో సైతం నవ్వులు పూయిస్తున్నారు. త్వరలో జరగబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ చాలా స్పెషల్. 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని శ్రీదేవి డ్రామా కంపెనీ టీం నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమో ఎంత సరదాగా ఉందో అదే స్థాయిలో భావోద్వేగానికి గురి చేసే అంశాలు కూడా ఉన్నాయి. ఆటో రాంప్రసాద్, పొట్టి నరేష్ కామెడీతో ప్రోమో మొదలయింది. ఆటో రాంప్రసాద్ సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడు. దీని చుట్టూ భలే కామెడీ అల్లారు. 

ఫైమా కూడా తాను ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నాను అని తెలిపింది. న గుర్తు పిడక నేనేంచేసినా దొరక అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది. ఆ తర్వాత హీరో సుధీర్ బాబు గెస్ట్ గా హాజరయ్యారు. సుధీర్ బాబు రష్మీ పై వేసిన సెటైర్ నవ్వులు పూయించేలా ఉంది. సుధీర్ బాబు ప్రేమకథా చిత్రం అనే లవ్ అండ్ హారర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. 

ఓ చిన్నారి సుధీర్ బాబుని దెయ్యం ఎక్కడ అని క్యూట్ గా అడుగుతుంది. దీనితో సుధీర్ బాబు తన పక్కనే ఉన్న రష్మీని ఉద్దేశిస్తూ ఆల్రెడీ ఒక దెయ్యం ఉన్నప్పుడు మరో దెయ్యం రాదు అని సెటైర్ వేశాడు. దీనితో అంతా నవ్వేశారు. 

ఆ తర్వాత నూకరాజు రంగంలోకి దిగి వరుసగా అందరిపై కామెడీ పంచ్ లు వేశాడు. ముఖ్యంగా ఇంద్రజ, ఫైమా లని ఆడేసుకున్నాడు. రేసుగుర్రం తరహాలో పాటని పేరడీ చేస్తూ ఫైమాపై ఇమ్మాన్యూల్ సెటైర్లు కురిపించాడు. దీన్ని చేసుకుంటే సంకనాకి పోతారు నేను జస్ట్ మిస్ అని తెలిపాడు. అయినా కూడా లోపల మనసు లాగుతోంది అని తెలిపాడు. దీనితో ఫైమా ముసిముసి నవ్వులు నవ్వింది. 

ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికపై తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దద్దరిల్లాయి. ఎంతో కోలాహలంగా తెలంగాణ సంప్రదాయాలు ఉట్టిపడేలా సెలెబ్రేషన్స్ చేశారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, బలిదానాలు చేసి అమరులైన వారిని ఉద్దేశిస్తూ నూకరాజు పాడిన ఎమోషనల్ సాంగ్ అందరి హృదయాల్ని పిండేసింది. మొదట నవ్వించిన నూకరాజు ఆ తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని తన పాటతో గుర్తు చేస్తూ ఏడిపించాడు. జూన్ 2న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. 

click me!