అందాల భామ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు సినిమాలు ఇటు సోషల్ మీడియాను గట్టిగా దున్నేస్తోంది. ఆమెకి యూత్ లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు పోస్ట్ చేసే క్రేజీ క్రేజీ ఫోటోలకు నెటిజెన్స్ ఫిదా అవుతుంటారు. ఎప్పుడూ ఫ్యాషన్ డ్రస్ లే కాకుండా... అప్పుడప్పుడు చీరలో అందాలు ఒలికిస్తూ ఫిదా చేస్తుంటుంది బ్యూటీ.
తాజాగా ఓ రెండు మూడు సార్లు చీరకట్టులో ఫిదా చేసింది బ్యూటీ. అంతే కాదు రీసెంట్ గా ఓనమ్ సెలబ్రేషన్ సమయంలో కూడా ఓనమ్ చీరలో మెస్మరైజ్ చేసింది. అంతేనా..? ఇటీవల పాట పాడి ఆడియన్స్ ని ఫిదా చేసిన అనుపమ.. ఇప్పుడు తాజాగా డాన్స్ తో అకట్టుకుంటుంది. అవ్వడానికి మలయాళ అమ్మాయి అయినా.. అచ్చతెలుగు ఆడపడుచులా కనిపిస్తోంది బ్యూటీ.
తాజాగా చీరకట్టు అద్భుతంగా కట్టి.. అందాలు ఆరబోసతూ.. డాన్స్ వేసి వావ్ అనిపించింది.ప్లేయిన్ బ్లూ శారీలో నడుము అందాలు ఆరబోస్తూ.. అనుపమ వేసిన సింపుల్ స్టెప్స్ కి కుర్రకారు అలా పడిపోయారంతే.. ప్రతి ఒక్కర్ని మెస్మరైజ్ చేసే విధంగా అనుపమా లుక్స్ ఉన్నాయి. నాజూగ్గా ఉన్న అనుపమా.. నలిపేస్తోంది.
ఇక ఇందుకు సంబంధించిన వీడియోని అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతుంది. వీడియోలో అనుపమ డాన్స్ కి వరుసగా లైక్స్ తో... పాటుగా రకరకాల కామెంట్లు కూడా వస్తున్నాయి. అనుపమ అందాన్ని.. చీరలో అప్సరసలా ఉన్నఆమె అందాన్ని పొగుడుతున్నారు.
ఇక అనుపమ పరమేశ్వరన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం టాలీవుడ్ లో టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఈ నెలలోనే రిలీజ్ అవ్వాల్సింది. కానీ సినిమాకి సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో పోస్ట్‌పోన్ చేసుకున్నారు.
కొత్త డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ మూవీ పై ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ సినిమాతో పాటు రవితేజ ఈగిల్ సినిమాలో కూడా అనుపమ నటిస్తుంది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే తమిళ్, మలయాళంలో కూడా ఒక్కో సినిమా చేస్తుంది.