అందరి ముందు యాంకర్‌ రష్మి పరువు తీసిన జబర్దస్త్ కమెడియన్‌.. కట్చీప్‌ తీసుకునే లోపు మాయమైందంటూ ట్రోలింగ్‌..

Published : Sep 12, 2023, 08:55 PM IST

హాట్‌ యాంకర్‌ రష్మి గౌతమ్‌.. ఓ వైపు యాంకరింగ్‌తో దుమ్మురేపుతుంది. మరోవైపు నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. కానీ ఇటీవల ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది. దీంతో తాజాగా బుల్లెట్ భాస్కర్‌ ట్రోల్‌ చేయడం గమనార్హం.  

PREV
18
అందరి ముందు యాంకర్‌ రష్మి పరువు తీసిన జబర్దస్త్ కమెడియన్‌.. కట్చీప్‌ తీసుకునే లోపు మాయమైందంటూ ట్రోలింగ్‌..

యాంకర్‌ రష్మి.. జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్‌ అయ్యింది. నటిగా సక్సెస్‌ కాలేదుగానీ, యాంకర్‌గా మాత్రం బాగా పాపులర్‌ అయ్యింది. స్టార్‌ యాంకర్‌గా రాణిస్తుంది. సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. గ్లామర్‌ ఫోటోలతో మరింతగా ఆకట్టుకుంటుంది. కుర్రకారుకి పిచ్చెక్కిస్తుంది. దీంతో క్రేజీ యాంకర్‌గా నిలుస్తుందీ రష్మి. 

28

దాదాపు పదేళ్లుగా జబర్దస్త్ యాంకర్‌గా కొనసాగుతుంది. అంతకు ముందు కూడా ఆమె షోస్‌ చేసింది. కానీ `జబర్దస్త్` తెచ్చిన క్రేజ్‌, గుర్తింపు, పాపులారిటీ మరే దాని ద్వారా రాలేదు. నిజానికి రష్మి గౌతమ్‌.. నటిగా నిరూపించుకునే ప్రయత్నం చేసింది. కానీ సక్సెస్‌ కాలేదు. తరచూ ఆ ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ విజయమనేది దోబూచులాడుతుంది. 
 

38

అయినప్పటికీ ఇటీవల ఆమె చిరంజీవితో కలిసి నటించింది. `భోళా శంకర్‌` చిత్రంలో రష్మి.. ఓ గ్లామర్‌ రోల్‌ చేసింది. సెకండాఫ్‌లో చిరంజీవి ఎంట్రీ సీన్‌లో కాసేపు సందడి చేసింది రష్మి. చిరు, రష్మి మధ్య చిన్న రొమాంటిక్‌ కన్వర్జేషన్‌ ఉంటుంది. ఇందులో చిరంజీవితో కలిసి రెచ్చిపోయింది రష్మి. కానీ ఆమె కాసేపట్లోనే మాయమవుతుంది. ఈ ఇద్దరి మధ్య సాంగ్‌ కూడా ఉంది. కానీ మధ్యలోనే రష్మి వెళ్లిపోతుంది.
 

48

పొట్టి స్కర్ట్ ధరించి, బ్లౌజ్‌ ముడేసి కనిపించింది రష్మి. రొమాంటిక్‌ మాటలతో కైపెక్కించేలా చేసింది. కానీ ఆమె కొద్ది సేపే ఉండటం ఆమె అభిమానులను నిరాశ పరిచింది. ఇంకాసేపు ఉంటే బాగుండనే ఫీలింగ్‌ కలిగించింది. ఆ డిజప్పాయింట్‌మెంట్‌.. జబర్దస్త్ కమెడియన్‌ బుల్లెట్‌ భాస్కర్‌ కి కూడా ఉందట. తాజాగా ఆ విషయాన్ని బయటపెట్టాడు. కాకపోతే అందరి ముందు రష్మిని ట్రోల్‌ చేయడం బాధాకరం. 
 

58

ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో రష్మి ప్రస్తావన తీసుకొచ్చాడు కమెడియన్‌ బుల్లెట్‌ భాస్కర్. మీరు చిరంజీవితో సినిమా చేశారని, మిమ్మల్ని చూద్దామని సినిమాకెళ్లినట్టు చెప్పాడు. ఫస్టాఫ్‌ మొత్తం కనిపించలేదని, ఇక సెకండాఫ్‌లో అయినా వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశాడట. సెకండాఫ్‌ ప్రారంభమయ్యే సమయంలో తన కట్చీఫ్‌ కింద పడిపోయిందని, అది కిందకి వంగి తీసుకునే లోపే రష్మి సీన్లు వచ్చిపోయాయని చెబుతూ సెటైర్లు పేల్చాడు. 
 

68

దీంతో రష్మి ఏం చేయాలో తెలియక బిత్తరపోయింది. చిరునవ్వుతో ఫేస్‌ టర్నింగ్‌ ఇచ్చుకుంది. ఇది షోలో నవ్వులు పూయించింది. అదే సమయంలో అందరి ముందు రష్మి పరువు తీసేశాడు బుల్లెట్‌ భాస్కర్‌. ట్రోల్‌ చేసినా అది సరదాగానే కావడంతో రష్మి కూడా లైట్ తీసుకుంది. జస్ట్ ఇది కామెడీని పంచింది. 

78

యాంకర్‌ రష్మి.. గతంలో చాలా సినిమాలు చేసింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. `గుంటూరు టాకీస్‌` మూవీ ఆమెకి మంచి పేరుని తీసుకొచ్చింది. కానీ ఆ సక్సెస్‌ ఎక్కువ కాలం లేదు. ఆ తర్వాత చేసిన ఒకటి రెండు చిత్రాలు బోల్తా కొట్టాయి. పైగా నటిగా ఆమెకి సినిమాలురాలేదు. దీంతో టీవీ షోస్‌కే పరిమితమయ్యింది. ఆ మధ్యన `బొమ్మ బ్లాక్ బస్టర్` చిత్రంలో మెరిసింది. ఆ సినిమా కూడా నిరాశ పరిచింది. 

88

మళ్లీ చిరంజీవి హీరోగా మెహర్‌ రమేష్‌ రూపొందించిన `భోళాశంకర్‌`లో మెరిసింది. ఇక తిరుగులేదు అనుకున్నారు. కానీ ఆ సినిమా కూడా పరాజయం చెందడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. సినిమాలు రష్మిక అచ్చిరావడం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు టీవీ షోస్‌తో మాత్రం దూసుకుపోతుందీ బ్యూటీ. గ్లామర్‌ ట్రీట్‌తో అలరిస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories