రామ్ చరణ్ - ఉపాసన రాయల్ లుక్.. పారిస్ లో ఫ్రెండ్ పెళ్లికి హాజరైన స్టార్ కపుల్..

First Published | Sep 12, 2023, 9:04 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన ప్రస్తుతం పారిస్ లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ వెడ్డింగ్ కు రాయల్ లుక్ లో హాజరై ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 
 

గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  - ఉపాసన కొణిదెల రీసెంట్ గా పారిస్ కు వెళ్లిన విషయం తెలిసిందే. రీసెంట్ ఎయిర్ పోర్టులో కనిపించిన పిక్స్ వైరల్ గా మారాయి. ఇక తాజాగా పారిస్ లో ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. 
 

రామ్ చరణ్, ఉపాసన కొణిదెల వారి స్నేహితుడు రోస్మిన్ మాధవ్‌జీ వివాహానికి హాజరయ్యేందుకు పారిస్ కు వెళ్లారు. ఈరోజు వెడ్డింగ్ లో ఆకర్షణీయమైన దుస్తుల్లో మెరిశారు. చెర్రీ, ఉపాసన రాయల్ లుక్ లో అందరినీ ఆకట్టుకున్నారు. మ్యాచింగ్ అవుట్ ఫిట్లలో గ్రాండ్ లుక్ ను సొంతం చేసుకున్నారు. 
 


ష్యాషన్ విషయంలో రామ్ చరణ్ ఐకానిక్ గా  మారిన విషయం తెలిసిందే. ‘ఆస్కార్’ వేడుకలో చరణ్ అవుట్ ఫిట్లకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఉపాసన కూడా స్టన్నింగ్ లుక్ లో మెరిశారు. ఇక చాలా రోజుల తర్వాత చరణ్, ఉపాసన రాయల్ పార్టీ వేర్స్ లో మెరియడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
 

చరణ్ గోధుమ రంగు అనార్కలి సూట్‌ను ధరించి, సన్ గ్లాసెస్ తో అదరగొట్టారు. ఉపాసన కూడా మ్యాచింగ్ వేర్ లో ఆకట్టుకుంది. అటు స్టైలిష్ గానూ ఇటు సంప్రదాయంగానూ డిజైన్ చేయడంతో వెడ్డింగ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

మెగా ప్రిన్సెస్ క్లింకార పుట్టిన తర్వాత వీరద్దరూ టూర్ కు వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకుముందు చాలా వెకేషన్లకు వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు పంచుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం పారిస్ లో ఎంజాయ్ చేస్తున్నారు. 
 

ఇక రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా మారిన విషయం తెలిసిందే. నెక్ట్స్  స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బుచ్చిబాబు డైరెక్షన్ లో RC16కూడా త్వరలో మొదలు కానుంది. 

Latest Videos

click me!