అనుపమా పరమేశ్వరన్ నేడు తన 30వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఆమె కొత్త సినిమాల అప్ డేట్లు వచ్చాయి. ఓ సైకలాజికల్ థ్రిల్లర్‌తోపాటు `క్రేజీ కల్యాణం` అనే చిత్రాల్లో నటిస్తోంది.
అనుపమా పరమేశ్వరన్ ఇప్పుడు విలక్షణ నటిగా మారిపోయింది. గ్లామర్ పాత్రలకంటే నటనకు ప్రయారిటీ ఉన్న పాత్రలు చేస్తూ మెప్పిస్తుంది. కంటెంట్ ఉన్న చిత్రాలతో అలరిస్తుంది. గతేడాది ఆమె `పరదా` వంటి కంటెంట్ బేస్డ్, ఉమెన్ ఓరియెంటెడ్ బేస్డ్ మూవీ చేసిన విషయం తెలిసిందే. చాలా సెలక్టీవ్‌గానే వెళ్తోంది, అదే సమయంలో మంచి బలమైన కథలతో వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె కొత్తగా రెండు సినిమాలను ప్రకటించింది. అందులో ఒకటి సైకలాజికల్ థ్రిల్లర్ కాగా, మరోటి కంప్లీట్ ఎంటర్‌టైనర్ `క్రేజీ కల్యాణం` ఉంది.
25
సైకలాజికల్ థ్రిల్లర్ తో రాబోతున్న అనుపమా పరమేశ్వరన్
సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ గురించి చూస్తే ఇందులో తనే మెయిన్ లీడ్‌గా చేస్తోంది. ఎస్‌కేజీ ఎంటర్టైన్‌మెంట్, బెంచ్ మార్క్ స్టోరీ టెల్లర్స్ సంయుక్తంగా ఈ మూవీని రూపొందిస్తున్నాయి. ఆర్జే షాన్ దర్శకత్వం వహిస్తున్నారు. శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా, కిరణ్ బల్లపల్లి నిర్మిస్తున్నారు. ఓ స్టూడియో భాగస్వామ్యంలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇది ఇంటెన్స్ సైకాలజికల్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. గతంలో అనుపమ–షాన్ కాంబినేషన్‌లో వచ్చిన షార్ట్ ఫిల్మ్‌కు అద్భుత స్పందన రావడంతో.. ఇప్పుడు అదే కాంబోలో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
35
మేలో ఈ మూవీ ప్రారంభం
ఈ సినిమా షూటింగ్ మేలో ప్రారంభం కానుంది. మూవీ టైటిల్‌ను త్వరలో ప్రకటించనున్నారు. అనుపమ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా అనౌన్స్‌మెంట్ చేశారు. ఇటీవలే 'జటాధర' మూవీని నిర్మించిన ఎస్కేజీ ఎంటర్‌టైన్‌మెంట్ తమ సంస్థ నిర్మాణంను మరింత విస్తరిస్తోంది. నిర్మాత ప్రేరణ అరోరా గతంలో రుస్తుం, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, పరి వంటి విజయవంతమైన చిత్రాలతో జాతీయ స్థాయి గుర్తింపు పొందారు.
మరో మూవీ `క్రేజీ కల్యాణం` మూవీ గురించి చూస్తే అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ఈ మూవీ రూపొందుతుంది. నరేష్ వీకే, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు.
55
కీర్తిగా మెరవబోతున్న `క్రేజీ కల్యాణం`
అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ `క్రేజీ కల్యాణం` మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పెళ్లి కూతురిగా సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న అనుపమ స్టిల్ ఆకట్టుకుంటోంది. ఆమె ఈ చిత్రంలో కీర్తి అనే క్యారెక్టర్ లో ప్రేక్షకులను అలరించనుంది. పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ తో సాగే చిత్రమిది. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిపారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు.