నాకు చిన్నప్పటినుంచి ఫ్రెండు, నాన్న, అన్న అన్ని మీరే. తప్పటడుగులు వేయించింది అమ్మే కానీ తప్పుడు అడుగులు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నది మాత్రం మీరే. అలాంటిది జీవితంలో మొదటిసారి తప్పు చెప్పుడు మాటలు విని మీ ఇద్దరి పట్ల అనుచితంగా ప్రవర్తించి మీ ఇద్దరినీ బాధ పెట్టాను. అందుకే నా కన్నీళ్ళతో మీ కాళ్లు కడుగుతున్నాను అనుకోని నన్ను క్షమించండి అంటూ కన్నీరు పెట్టుకుంటాడు నీరజ్. ఆర్య, నీరజ్ ని దగ్గరికి తీసుకుని హత్తుకుంటాడు. తప్పు పరిస్థితులది కానీ నీది కాదు అంటాడు ఆర్య. ఆ పరిస్థితులకి లోబడటం నాదే తప్పు అందుకే అందరి ముందు క్షమాపణ అడుగుతున్నాను అంటాడు నీరజ్.