చీరకట్టులో కుమారి సిట్టింగ్ పోజులు.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో హేబా పటేల్ మెరుపులు.. బ్యూటీఫుల్ ఫొటోస్..

First Published | May 1, 2023, 7:44 PM IST

యంగ్ హీరోయిన్ హెబా పటేల్ (Hebah Patel) తాజాగా చీరకట్టులో మెరిసింది. అదిరిపోయే సిట్టింగ్ పోజులతో మైమరిపించింది. యంగ్ బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 
 

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ హెబా పటేల్ ‘కుమారి 21ఎఫ్’తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెప్పుకుంది. టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వడంతోనే  బోల్డ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. తన గ్లామర్ తోనూ అట్రాక్ట్  చేసింది. 
 

మంచి క్రేజ్ దక్కించుకోవడంతో యంగ్ బ్యూటీకి  ఆఫర్లు కూడా వరుసగా దక్కాయి. రాజ్ తరుణ్ సరసన ఎక్కువ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆడియెన్స్ ను అలరించింది.  కొన్నాళ్ల పాటు వరుస చిత్రాల్తో అలరించిన పెద్దగా సక్సెస్ అందుకుంది.
 


పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో ఈ ముద్దుగుమ్మ ఏకంగా స్పెషల్ సాంగ్స్ లోనూ అలరించి  ఆకట్టుకుంది.  ‘రెడ్’ మూవీలో రామ్ పోతినేని సరసన స్పెషల్ డాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాతో హేబా నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. 

ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు హేబా పటేల్. సినిమాలతోనే కాకుండా వెబ్ సిరీస్ లతోనూ అలరిస్తోంది.  రీసెంట్ గా ‘వ్యవస్థ’ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది.  ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది.
 

నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గానే ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో అదిరిపోయే లుక్స్ లోనూ ఆకట్టుకుంది  వరుసగా తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను కట్టిపడేస్తోంది.
 

తాజాగా  హేబా వైట్ శారీ,  స్లీవ్ లెస్ బ్లౌజ్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. చీరకట్టులో పెళ్లి కూతురిలా ఫోజులిచ్చి ఆకట్టుకుంది. లేటెస్ట్ ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. హేబా బ్యూటీఫుల్ లుక్ కు లైక్స్, కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం తమిళం, తెలుగుతో చిత్రాలు చేస్తోంది.
 

Latest Videos

click me!