జారిపోతున్న కొంగు.. టాప్ గ్లామర్ తో మతులు పోగొడుతున్న రకుల్.. చీరకట్టులో ఢిల్లీ భామ కిర్రాక్ పోజులు

First Published | May 1, 2023, 10:36 PM IST

చీరకట్టులో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) అందాల ప్రదర్శన చేస్తూ మతులు పోగొడుతోంది. బ్యూటీఫుల్ లుక్ లో గ్లామర్ మెరుపులతో చూపుతిప్పుకోకుండా చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి. 
 

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన నయా లుక్స్ తో అదరగొడుతోంది. ఇటీవల గ్లామర్ షోతో తెగ సందడి చేస్తున్న ఈ స్టార్ బ్యూటీ తాజాగా మరిన్ని బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 
 

టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు ఊపూపిన ఢిల్లీభామ తనదైన ముద్ర వేసుకుంది. స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ స్టేటస్ ను దక్కించుకోవడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకుంది. ఇండస్ట్రీలోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 
 


మూడేండ్లుగా తెలుగు సినిమాలకు రకుల్ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.  చివరిగా ‘కొండపొలం’లో మెరిసింది.  ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.  ఈ గ్యాప్ లో బాలీవుడ్ లో దుమ్ములేపిన ఈ ముద్దుగుమ్మ.. మళ్లీ సౌత్ వైపు చూస్తోంది.
 

ఇదిలా ఉంటే.. రకుల్ ప్రీత్ సింగ్ తన లేటెస్ట్ లుక్ తో ఆకట్టుకుంటోంది. చీరకట్టులో దర్శనమిచ్చింది.  ట్రాన్స్ ఫరెంట్ శారీలో అందాల ప్రదర్శన చేస్తూ అదరగొట్టింది. ఎల్లో శారీలో, స్లివ్ లెస్ బ్లౌజ్ లో రకుల్ టాప్ గ్లామర్ షోతో మైమరిపించింది. తన అందంతో కుర్రాళ్ల చూపులను కట్టిపడేసింది. 
 

ఈ ఫొటోలను పంచుకుంటూ రకుల్ క్రేజీగా  కామెంట్ కూడా చేసింది. ‘ఎల్లప్పుడూ ఎల్లో ఎల్లో డర్టీఫెల్లో కాకపోవచ్చు’ అంటూ ఫన్నీగా క్యాప్షన్ ఇచ్చింది. ఇక లేటెస్ట్ ఫొటోలపై ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. రకుల్ ప్రీత్ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి  ఎతుత్తున్నారు. 

ప్రస్తుతం సౌత్ లో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘ఇండియన్ 2’లో రకుల్ నటిస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.  కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలాగే శివకార్తికేయ సరసన ‘ఆయలాన్’లోనూ నటించింది. ఈ చిత్రం నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Latest Videos

click me!