మీరేమీ హాలిడే రిసార్ట్ కి రాలేదు, జైలు నుంచి హాస్పిటల్ కి వచ్చారని గుర్తుపెట్టుకోండి అంటాడు ఎస్సై. ఇప్పుడే గుర్తొచ్చింది అంటూ కాన్ఫిడెంట్గా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆర్య. మాటల్లో తేడా కనిపిస్తుంది ఏంటి సార్ అంటాడు కానిస్టేబుల్. కరెంట్ షాక్ కి చిప్ పోయినట్లుగా ఉంది అంటూ వెటకారం గా మాట్లాడుతాడు ఎస్ఐ. రూమ్ కి వచ్చిన ఆర్య వర్ధన్ జెండే కి ఫోన్ చేసి ట్విన్ సిటీస్ లో 11 ఐఫోన్లు ఎవరు కొన్నారు, ఏ సిరీస్ అన్ని డీటెయిల్స్ నాకు చాలా అర్జెంటుగా కావాలి అని చెప్తాడు. సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు జెండే.