PS 2 Review: పొన్నియిన్ సెల్వన్ 2 ప్రీమియర్ టాక్: బాహుబలి 2 రేంజ్ ఉందా? అదే మైనస్ అంటున్న నెటిజన్లు!

First Published | Apr 28, 2023, 5:54 AM IST


తమిళ సినిమా ప్రైడ్ గా పొన్నియిన్ సెల్వన్  సిరీస్ తెరకెక్కించారు. దర్శకుడు మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్. పార్ట్ 1 విజయం సాధించిన నేపథ్యంలో పార్ట్ 2పై అంచనాలు ఏర్పడ్డాయి. భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడిక్ పొలిటికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ 2 ఏప్రిల్ 28న విడుదల కాగా ప్రీమియర్ టాక్ ఎలా ఉందో చూద్దాం.. 

PS 2 Movie Review

కథ:
కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవలను అదే పేరుతో సినిమాగా రూపొందించారు. కథ గురించి చెప్పాలంటే రాజ్యాన్ని హస్తగతం చేసుకునేందుకు చోళనాడు యువరాజు అరుణ్మోజి వర్మన్ ని చంపాలనుకుంటారు. యువరాజును కాపాడే బాధ్యత వల్లవరాయన్(కార్తీ) తీసుకుంటారు. సముద్రంలో ప్రత్యర్ధులతో జరిగిన యుద్ధంలో అరుణ్మోజి( జయం రవి) మరణించాడని భావిస్తారు.అరుణ్మోజి మరణానికి ప్రతీకారంగా ఆదిత్య కరికాలన్(విక్రమ్) ఏం చేశాడు? అసలు చోళులపై నందిని(ఐశ్వర్య రాయ్) పగ ఎందుకు పెంచుకున్నారు? ఆదిత్య కరికాలుడిని చంపి, చోళనాడును ఆమె ఎందుకు నాశనం చేయాలనుకుంటుంది? వంటి ప్రశ్నల సమాహారమే పొన్నియిన్ సెల్వన్ 2. 

PS 2 Movie Review

పార్ట్ 1 అరుళ్మోజి, వల్లవరాయన్ ప్రమాదంలో ఉన్నట్లు ముగించారు. అయితే వారిని కాపాడేందుకు ఓ మహిళ వచ్చినట్లు చూపించారు. చోళ నాడు మాత్రం అరుళ్మోజి చనిపోయినట్లు భావిస్తుంది. యువరాజు మరణించిన నేపథ్యంలో రాజ్యంలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులు పొన్నియిన్ సెల్వన్ 2 లో చూడవచ్చు.


PS 2 Movie Review

గత ఏడాది విడుదలైన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 కోలీవుడ్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఐదు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. తమిళ నేటివిటీ, లెక్కకు మించిన పాత్రలు, కథ మొత్తం పార్ట్ 2 కోసం దాచేశారన్న నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. అలాగే యాక్షన్ కూడా ఆశించినంతగా లేదన్న అభిప్రాయం ప్రేక్షకులు వెల్లడించారు. 

PS 2 Movie Review

మరి పార్ట్ 2 లో ప్రేక్షకులు కోరిన అంశాలు ఉన్నయా అంటే... నెటిజెన్స్ అభిప్రాయంలో అవును. మణిరత్నం రెండవ భాగం మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. ప్రీమియర్స్ చూసిన ఆడిషన్స్ అభిప్రాయం ప్రకారం... పొన్నియిన్ సెల్వన్ 2 నిర్మాణ విలువలు బాగున్నాయి. స్క్రీన్ ప్లే, బీజీఎం మెప్పిస్తాయి. కల్కి కృష్ణమూర్తి నవలకు తెర రూపం ఇచ్చే క్రమంలో ఆయన ఎక్కడా డైవర్ట్ కాలేదు. ఉన్నది ఉన్నట్లు హానెస్ట్ గా చెప్పే ప్రయత్నం చేశారంటున్నారు.

PS 2 Movie Review

పార్ట్ 1 లో విక్రమ్ పాత్రకు పెద్దగా నిడివి ఉండదు. అయితే కథలో విక్రమ్, ఐశ్వర్య రాయ్ పాత్రలు కీలకం అన్న హింట్ ఇచ్చారు. ఊహించినట్లే పార్ట్ 2 లో వీరిద్దరి మధ్య సన్నివేశాలు అలరించాయని ప్రీమియర్ టాక్. అలాగే కార్తీ , జయం రవి, త్రిష పాత్రలు అంచనాలకు తగ్గట్లు ఉన్నాయి.

PS 2 Movie Review

అయితే కథనం నెమ్మదిగా సాగుతుంది. అలాగే ఎలాంటి మలుపులు లేని ఫ్లాట్ నేరేషన్ నిరాశపరుస్తాయి. ట్రిమ్ చేసి నిడివి కొంత మేర తగ్గిస్తే బాగుండని కొందరు ప్రేక్షకుల అభిప్రాయం. అయితే ఫస్ట్ హాఫ్ కంటే బాగుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అది కలిసొచ్చే అంశం. కొన్ని యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ అబ్బురపరుస్తాయని అంటున్నారు.

PS 2 Movie Review

తమిళ ఆడియన్స్ పార్ట్ 1 మాదిరి పార్ట్ ని ఆదరించడం ఖాయం. ఇక మిగతా భాషల ఆడియన్స్ ని ఈ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. పొన్నియిన్ సెల్వన్ సిరీస్ నవల ఆధారంగా తెరకెక్కగా మణిరత్నం ప్యూర్ గా దాన్ని అనుసరించి తెరకెక్కించారు. తమిళ నేటివిటీ, లెక్కకు మించిన పాత్రలు, వారి పేర్లు ఇతర భాషల ఆడియన్స్ కి ఇబ్బందిగా మారాయి. తమిళ ఆడియన్స్ పార్ట్ 2ని కూడా ఇష్టపడతారనడంలో సందేహం లేదు. ఇతర భాషల్లో ఎలాంటి ఫలితం అందుకుంటుందనేది ఆసక్తికరం.

Latest Videos

click me!