అన్ని బాగుంటే నీ బిడ్డలు కూడా అంటూ ఏదో అనబోతుంది కానీ ఆర్య బాధపడటం చూసి ఆగిపోతుంది. పంతులుగారు పూజ పూర్తయింది అని చెప్పటంతో పాపని తీసుకుని వెళ్లి బామ్మ కి అప్పజెప్తాడు ఆర్య. ఈరోజు మీ పాప వల్ల పూజ బాగా జరిగింది అని చెప్పి వదలలేక, వదలలేక వెళ్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి పోదాము అంటుంది అను. ప్రసాదం తీసుకోకుండా వెళ్ళకూడదమ్మ ఉండు ప్రసాదం తీసుకొస్తాను అంటుంది బామ్మ. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అంటుంది అను.