మలయాళం చిత్రాలతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అను ఇమ్మాన్యుయేల్ టాలీవుడ్ ఎంట్రీ తర్వాత మంచి గుర్తింపు తెచ్చుకుంది. నేచురల్ స్టార్ నాని, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, నాగ చైతన్య, శర్వానంద్ సరసన నటించి మరింత పాపులారిటీని పెంచుకుంది. వరుస చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ ఇంకా స్టార్ డమ్ ను మాత్రం సొంతం చేసుకోలేదు.