Jamuna: హీరోయిన్ల గ్లామర్ షోపై జమున బోల్డ్ స్టేట్ మెంట్.. సీనియర్ నటికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఏఎన్నాఆర్..

Published : Jun 29, 2026, 06:56 PM IST

Jamuna: తెలుగు సినీ చరిత్ర తిరగేస్తే కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్. అలాంటి కాంబినేషనే అక్కినేని, జమున. వీరి జంట తెరపై కనిపిస్తే అద్భుతమైన కెమిస్ట్రీ పండేది. బయట కూడా ఇద్దరి మంచి ఫ్రెండ్స్. ఓసారి జమున బోల్డ్ కామెంట్ కు ANR కౌంటర్ ఇచ్చారంట. 

PREV
15
ఎన్నో సినిమాలు చేసిన అక్కినేని, జమున

ANR-జమున ఎన్నో సినిమాలు చేశారు. ఇలవేల్పు, భూకైలాస్, పూజాఫలం, గుండమ్మ కథ, మూగ మనసులు. దొంగరాముడు...ఇలా ఎన్నో సినిమాలు చేశారు. దొంగరాముడు సినిమాలో ఏఎన్నాఆర్ కు జమున చెల్లెలిగా నటించారు. ఇలా ఎన్నో చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించి మెప్పించారు. ముఖ్యంగా సెంటిమెంట్, లవ్, అల్లరి.. ఇలా ఏ ఎమోషన్ అయినా వీరి మధ్య చాలా సహజంగా పండేది. 

25
అక్కినేని, జమునల సినీ ప్రయాణంలో పెద్ద వివాదం

ఏఎన్నార్, జమునల సినీ ప్రయాణంలో ఒక పెద్ద వివాదం కూడా ఉంది. అప్పట్లో అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో జమునకు కొన్ని ఈగో సమస్యలు వచ్చాయి. జమునకు పొగరు ఎక్కువనే కారణంతో ఆ ఇద్దరు పెద్ద హీరోలు ఆమెను తమ సినిమాల్లో తీసుకోకూడదని, ఆమెపై ఆరేళ్ల పాటు నిషేధం విధించారు. అయినప్పటికీ జమున అస్సలు తగ్గలేదు. చిన్న హీరోలతో, ఇతర భాషల్లో నటిస్తూ తన సత్తా చాటారు. అయితే, కథల డిమాండ్ రీత్యా, జమున నటనపై ఉన్న గౌరవంతో ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు మళ్లీ ఆమెతో సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఏఎన్నార్, జమునల మధ్య ఆ తర్వాత మంచి స్నేహబంధం ఏర్పడింది. 

35
ఏఎన్నార్‌ను బావ అని పిలిచేవారు

నిజ జీవితంలో అక్కినేని నాగేశ్వరరావును.. జమున ‘బావ’ అని పిలిచేవారట. ఎన్టీఆర్ కంటే ఏఎన్నార్‌తోనే ఆమెకు చనువు ఎక్కువ. షూటింగ్ సెట్స్‌లో ఇద్దరూ ఎంతో సరదాగా ఉండేవారు. ఏఎన్నార్ చనిపోయే వరకు వారి మధ్య ఆ స్నేహం అలాగే కొనసాగింది. 

45
సినిమా ఇండస్ట్రీ మారదు

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాల్లోకి వెళ్లడం మంచిదికాదన్నారు. సినిమా ఇండస్ట్రీ ఒక షార్ట్ లైఫ్ అని అన్నారు. కేవలం డబ్బు కోసమే ఎక్స్ పోజింగ్ చేస్తున్నారనేది జమున గారి అభిప్రాయం. అయితే ఒకరోజు జమున, ఏఎన్నార్ మాట్లాడుకుంటూ ఉండగా...జమున ఒక బోల్డ్ కామెంట్ చేశారు. సినిమా ఇండస్ట్రీ ఇక మారదు అన్నారు. ఇంకా దిగజారిపోతున్నారని, నీలి చిత్రాల కంటే దారుణంగా ఉందని విమర్శించారు. దానికి అక్కినేని నాగేశ్వరరావు గారు కౌంటర్ ఇచ్చారు. భూమి గుండ్రంగా ఉన్నట్లే...మళ్లీ పాత పద్ధతులు వస్తాయని ఆయన అన్నారట. 

55
అసలు సినీ పరిశ్రమే ఉండదు

ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే పాత పరిస్థితులు ఇంక రావని ఆమె అభిప్రాయపడ్డారు. కొన్ని ఏళ్లకు అసలు సినీ పరిశ్రమే ఉండదన్నారు. జమున గారు తన లైఫ్ లో ఎన్నో కష్టాలు పడ్డారు. అయినా కూడా ఏమాత్రం బెంగ, బెరుకు లేకుండా నిలబడ్డారు. రీల్ సత్యభామగా ఎలా పొగరుగా ఉండేవారో..రియల్ గానూ అంతే హుందాగా, ధైర్యంగా ఉండేవారట

Read more Photos on
click me!

Recommended Stories