
బాలీవుడ్‌లో ఒకప్పుడు ఎంతగానో చర్చించుకున్న సెలబ్రిటీ రిలేషన్స్ లో అతిలోక సుందరి శ్రీదేవి, ఒకప్పటి స్టార్ హీరో మిథున్ చక్రవర్తి మధ్య బంధం. వీరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు, ఆఫ్-స్క్రీన్ రిలేషన్‌షిప్ గురించి కూడా అప్పట్లో పెద్ద చర్చే నడిచింది. 80వ దశకంలో ఇద్దరూ తమ కెరీర్‌లో పీక్స్‌లో ఉన్నారు. వాళ్ల బంధం గురించి దశాబ్దాలుగా ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. రహస్యంగా పెళ్లి చేసుకున్నారని, తర్వాత విడిపోయారని ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. అయితే, మిథున్ గానీ, శ్రీదేవి గానీ తమ పెళ్లి విషయాన్ని ఎప్పుడూ బయటపెట్టలేదు. ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ ఈ వార్తలకు మళ్లీ ప్రాణం పోశారు. షాకిచ్చే నిజాలను బయటపెట్టారు.
మిథున్ చక్రవర్తి, శ్రీదేవి తమ సినిమాలతో ఎంత ఫేమస్ అయ్యారో, వాళ్ల పర్సనల్ లైఫ్‌తోనూ అంతే వార్తల్లో నిలిచారు. ఇప్పుడు శ్రీదేవి మన మధ్య లేకపోయినా, వాళ్లిద్దరి బంధం గురించి మరోసారి చర్చ మొదలైంది. సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయం బయటపెట్టారు. వాళ్లిద్దరూ కొంతకాలం పాటు భార్యాభర్తల్లా కలిసి జీవించారని ఆయన అన్నారు. `నిజానికి వాళ్లు దాదాపు మూడు నెలల పాటు పెళ్లైన జంటలా కలిసి ఉన్నారు` అని జ్యోతి వెంకటేష్ స్పష్టం చేశారు. ఒక అవుట్‌డోర్ షూటింగ్ సంఘటనను గుర్తుచేసుకుంటూ, ఆ సమయాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. `మిథున్‌కు ఒక అవుట్‌డోర్ షూట్ ఉండేది, నేను కూడా వెళ్లాను. శ్రీదేవి ఎప్పుడూ సెట్‌కు వచ్చేది కాదు. ఆమె తన గదిలోనే ఉండేది. కానీ, వాళ్లిద్దరూ కలిసే ఉన్నారని అందరికీ తెలుసు` అని ఆయన గుర్తుచేసుకున్నారు.
మిథున్-శ్రీదేవికి సంబంధించిన ఓ సరదా సంఘటన ఆ సమయంలో మిథున్ చక్రవర్తితో జరిగిన ఒక ఫన్నీ సంభాషణను కూడా జ్యోతి వెంకటేష్ పంచుకున్నారు. `మిథున్ నాకు చాలా మంచి స్నేహితుడు. నేను ఆయనతో సరదాగా ఓ మాట అన్నాను. 'మిథున్ సర్, మీరు ఇప్పుడు తమిళం నేర్చుకునే ఉంటారుగా' అని అడిగాను. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఆయన వెంటనే అర్థం చేసుకుని, 'దయచేసి నాతో తమిళంలో మాట్లాడకు. నేను ఎలా ఉన్నానో అడుగు చాలు' అన్నారు. ఆయన ఉద్దేశం శ్రీదేవి గురించే అని స్పష్టంగా అర్థమైంది" అని జ్యోతి చెప్పారు. మరి ఆ బంధం ఎందుకు ముగిసిందనేది చెబుతూ, `వాళ్ల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. అప్పటికి శ్రీదేవి స్టార్‌డమ్ చాలా పెద్దది. మిథున్ కూడా సక్సెస్‌ఫుల్ యాక్టరే, కానీ శ్రీదేవి ఒక లెజెండరీ స్టార్‌గా ఎదిగింది . అంతకుముందు మిథున్ చాలా రిలేషన్‌షిప్స్‌లో ఉండటంతో, బంధాల విషయంలో అతడిని నమ్మలేమని చాలామంది అనుకునేవారు` అని కూడా ఆయన అన్నారు. అనంతరం యోగితా బాలీతో మిథున్ పెళ్లి విజయవంతమైందని వెంకటేష్ తెలిపారు. `మొదటి భార్య హెలెనా ల్యూక్‌తో విడాకుల తర్వాత యోగితా బాలీని పెళ్లి చేసుకున్నప్పుడు, ఆ పెళ్లి నిలుస్తుందని చాలామంది నమ్మలేదు. కానీ వాళ్ల పెళ్లి జరిగి చాలా ఏళ్లయింది. వారికి ముగ్గురు కొడుకులు, ఒక దత్తపుత్రిక ఉన్నారు` అని చెప్పారు.
పెళ్లిని ధ్రువీకరించని మిథున్, శ్రీదేవి మిథున్ చక్రవర్తి, శ్రీదేవి తమ పెళ్లిని ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు. కానీ, 80వ దశకం చివర్లో వాళ్ల బంధంపై పుకార్లు మొదలయ్యాయి. చాలాకాలంగా వినిపిస్తున్న కథనాల ప్రకారం, 80ల ప్రారంభంలో 'జాగ్ ఉఠా ఇన్సాన్' సినిమా సెట్‌లో వాళ్లిద్దరూ కలుసుకున్నారు. అక్కడే వాళ్ల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ నిజ జీవిత ప్రేమగా మారింది. 1985లో రహస్యంగా పెళ్లి చేసుకుని, 1988 వరకు కలిసే ఉన్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పటికే మిథున్‌కు యోగితా బాలీతో పెళ్లయింది. ఈ బంధం కారణంగా మిథున్, యోగితాల పెళ్లిలో కూడా చాలా సమస్యలు వచ్చాయని అంటారు. మిథున్ తన భార్యను వదిలిపెట్టడని అర్థమయ్యాక, శ్రీదేవి ఆ బంధాన్ని ముగించుకుందని సమాచారం. ఆ తర్వాత, 1996లో ఆమె నిర్మాత బోణీ కపూర్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, ఇద్దరూ ఇప్పుడు హీరోయిన్లే. శ్రీదేవి 8 ఏళ్ల క్రితం దుబాయ్‌లో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది.