ప్రభాస్ కు పిచ్చ కోపం తెప్పించింది ఎవరు, అప్పుడేం చేసాడో చెప్పిన రాజమౌళి

First Published | Sep 20, 2024, 12:34 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. 

ప్రభాస్ కు  రాజమౌళి కు ఉన్న అనుబంధం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఛత్రపతి, బాహుబలి వంటి సూపర్ హిట్స్ వచ్చాయి. రాజమౌళి ఎప్పుడు అడిగితే అప్పుడు ప్రభాస్ డేట్స్ ఇచ్చేస్తారు. కథ కూడా వినకుండా ఓకే చెప్పేస్తారు అంటారు. అందులో నిజం ఉందనేది నిజం.

ఇప్పటికీ తనని చాలా మంది `బాహుబలి` ప్రభాస్‌గానే పిలుస్తుంటారు. వారి మనసులో తాను బాహుబలిగా ముద్ర పడిపోయానని, ఈ సినిమా ప్రభావం ఆడియెన్స్ పై కూడా చాలా ఉందని, అందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. 

 వీరిద్దరు సినిమాలకు అతీతంగా మంచి స్నేహితులు. ఈ నేపధ్యంలో ప్రభాస్ పర్శనల్ విషయాలు ప్రతీది రాజమౌళికి తెలుసు. ముఖ్యంగా ప్రభాస్ కు కోపం వచ్చేది ఎప్పుడు..సెట్ లో కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారో చెప్పుకొచ్చారు ఓ సారి ఇంటర్వూలో రాజమౌళి.


రాజమోళి, ప్రబాస్ స్నేహం ఛత్రపతి సినిమాతో మొదలైంది. బాహుబలి రెండు భాగాల చిత్రాలతో ఈ ఇద్దరు మిత్రులు ప్రపంచస్థాయి సక్సెస్ ని అందుకున్నారు. ప్రతి సందర్భంలో ఒకరి కోసం మరొకరు అనేంత స్నేహ భావాన్ని చూపిస్తారు ప్రభాస్, రాజమౌళి.

 రాజమౌళి కుటంబంతోనూ ప్రభాస్ పూర్తి స్దాయి స్నేహంగా ఉంటారు. వీరిద్దిర అనుబంధం మామూలుగా ఉండదు. ఈ క్రమంలో రాజమౌళి ..ప్రబాస్ గురించి చెప్పిన విషయాల్లో ఒకటి ఇప్పుడు చూద్దాం.

రాజమౌళి మాట్లాడుతూ...ప్రభాస్ కు మాగ్జిమం కోపం తెప్పించేది కెమెరామెన్ సెంథిల్. కారణం ఏంటంటే సెంధిల్ బాగా ఫెరఫెక్షనిస్ట్. నాకంటే కూడా. ఆ విషయం బల్ల గుద్ది చెప్పచ్చు. స్టూడియోలో షూట్ చేసేటప్పుడు ఆ లైట్స్ ఒకే ఇంటెన్సిటీ ఇస్తాయి. అవేమీ మారవు.

కానీ సెంధిల్ పది సార్లు తన అసెస్టెంట్స్ చేత మీటర్ చెక్ చేయిస్తూంటాడు. అంటే ఆర్టిస్ట్ కరెక్ట్ గా రెడీ అయ్యినప్పుడు కూడా తీసుకొచ్చి చెక్ చేస్తూంటాడు. అది ప్రబాస్ కు చిరాకు తెప్పిస్తూంటుంది.

 ఒక్కోసారి పిచ్చ కోపం తెప్పిస్తూంటుంది. కోపం వచ్చినా సరే కంట్రోలు చేసుకుంటూ ఏయ్ సెంథిలూ, ఎన్నాళ్ళయ్యా, ఎంత సేపు అయ్యా అంటాడు. అంతకు మించి ప్రబాస్ కు మాగ్జిమం కోపం తెప్పించే వ్యక్తి కనపడలేదు అన్నారు రాజమౌళి.

ఛత్రపతి మూవీ షూటింగ్ సమయంలో గ్యాప్ తీసుకొని పార్టీ చేసుకుందామని ప్రభాస్ చెప్పగా నేను సరేనని డేట్ ఫిక్స్ చేశామని రాజమౌళి తెలిపారు. అయితే పార్టీ చేసుకోవాల్సిన రోజు కూడా షూట్ ఉండటంతో ఆ సమయంలో ప్రభాస్ ఫీల్ అయ్యాడని రాజమౌళి వెల్లడించారు. 
 

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఇటీవలే కల్కి  సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు.

ప్రభాస్ ని రాజమౌళి(Rajamouli) ఛత్రపతి సినిమాతో స్టార్ హీరో చేసాడు. ఆ తర్వాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ చేసాడు. ఈ విషయం అందరికి తెలిసిందే. ప్రభాస్, రాజమౌళి కూడా చాలా క్లోజ్ గా ఉంటారు. ఇద్దరూ కలిసి మూడు సినిమాలు చేయడంతో వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. 

Latest Videos

click me!