ANR: విగ్గు లేకుండా నటించమన్న డైరెక్టర్, అట్టర్ ఫ్లాప్ అవుతుందన్న స్టార్ హీరో.. కట్ చేస్తే 200 రోజులు

Published : Nov 08, 2026, 04:20 PM IST

లెజెండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వర రావుని ఓ దర్శకుడు విగ్గు లేకుండా నటించమని అడిగారట. దీనికి ఏఎన్నార్ ఇచ్చిన రియాక్షన్ ఏంటి ? అసలు ఆ సినిమా ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
15
ANR

టాలీవుడ్ లెజెండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు తన కెరీర్ లో చేయని పాత్ర లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో ఏఎన్నార్ నటించి మెప్పించారు. ఏఎన్నార్ కి అప్పట్లో మహిళా ప్రేక్షకుల ఆదరణ విపరీతంగా ఉండేది. ఏఎన్నార్ రిటైర్మెంట్ దశకు చేరుకున్న తర్వాత కూడా సంచలనం సృష్టించారు. ఏఎన్నార్ ప్రధాన పాత్రలో మీనా మనవరాలిగా నటించిన చిత్రం సీతా రామయ్య గారి మనవరాలు.

25
సీతారామయ్య గారి మనవరాలు మూవీ

1991లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అయితే ఈ మూవీ హిట్ అవుతుందని ఏఎన్నార్ కి ఏమాత్రం నమ్మకం లేదట. డైరెక్టర్ క్రాంతి కుమార్ ఏఎన్నార్ కి ఈ చిత్ర కథ చెప్పగానే.. ఈ మూవీ ఆడదు అని తేల్చేశారు. లేదు నాకు నమ్మకం ఉంది అని క్రాంతి కుమార్ అన్నారట. మీరు ఒకే అంటే నేను ఈ మూవీ చేస్తాను నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. కానీ సినిమా మాత్రం వర్కౌట్ కాదు అని ఏఎన్నార్ తెలిపారు.

35
విగ్గు లేకుండా నటించమని అడిగిన దర్శకుడు

ఎందుకంటే ఇది క్లాస్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చే కథ, సెంటిమెంట్ డోస్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏఎన్నార్ అలా అన్నారు. ఇక సినిమా ప్రారంభానికి ముందు మీరు విగ్గు లేకుండా నటించాలి అని క్రాంతి కుమార్ ఏఎన్నార్ తో చెప్పారు. అందుకు ఏఎన్నార్ ఒప్పుకోలేదు. ఈ విషయాలన్నీ ప్రముఖ రచయిత చిల్లగట్టు శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. విగ్గు లేకుండా నేను నటించను అని ఏఎన్నార్ అన్నారట.

45
ఏఎన్నార్ ఎలా ఒప్పుకున్నారంటే

విగ్గు లేకుంటేనే సీతారామయ్య అనే పాత్రకు హుందా తనం వస్తుంది అని క్రాంతి కుమార్ తెలిపారు. విగ్గుతో కొన్ని లుక్ టెస్ట్ లు.. విగ్గు లేకుండా కొన్ని లుక్ టెస్ట్ లు చేశారట. విగ్గు లేకుంటేనే బావుంది అని చాలా మంది చెప్పడంతో ఏఎన్నార్ కూడా ఓకె అన్నారు. మొత్తానికి సినిమా పూర్తయింది. రిలీజ్ కూడా చేశారు. సీడెడ్, నైజాం ఏరియాల నుంచి టాక్ చాలా దారుణంగా ఉంది.

55
200 రోజులు ఆడిన సినిమా

ఓ ప్రాంతం నుంచి థియేటర్ ఓనర్ సినిమా విడుదలైన వారం తర్వాత ఫోన్ చేసి ఈ చిత్రానికి కలెక్షన్స్ రావడం లేదు ఇక తీసేస్తాం అని సీతారామయ్య గారి మనవరాలు చిత్ర నిర్మాత దొరస్వామి రాజు గారికి చెప్పారట. ఆయన బదులిస్తూ ఇంకొక్క వారం ఉంచండి. అప్పటికీ కలెక్షన్స్ రాకుంటే మీ థియేటర్ కి 175 రోజులకు ఎంత రెంట్ అవుతుందో అంతా నేనే భరిస్తా అని చెప్పారట. ఆయన కాన్ఫిడెన్స్ కి వాళ్ళు ఆశ్చర్యపోయారు. రెండు వారాల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ప్రవాహంలా థియేటర్స్ కి వెళ్లడం ప్రారంభించారు. దీనితో 175 రోజులు కాదు చాలా థియేటర్స్ లో 200 రోజులు ఈ చిత్రం ప్రదర్శించబడింది. ఏకంగా ఈ చిత్రం 3 నంది అవార్డులు సొంతం చేసుకుంది. మీనాకి టాలీవుడ్ లో తిరుగులేని గుర్తింపు దక్కింది ఈ చిత్రంతోనే.

Read more Photos on
click me!

Recommended Stories