Nagavva Top 5 Folk Songs: గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే పాటలతో అదరగొడుతున్న చుంచు నాగవ్వ వాయిస్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. సోషల్ మీడియాను ఊపేస్తున్న నాగవ్వ టాప్ ఫోక్ సాంగ్స్ వివరాలు మీకోసం.
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న తెలంగాణ జానపద కోకిల చుంచు నాగవ్వ
తెలంగాణ జానపద పాటలకు ఒక ప్రత్యేకమైన గమ్మత్తు, మట్టి వాసన ఉంటాయి. మన పల్లెటూరి జీవనశైలి, స్వచ్ఛమైన ప్రేమలు, బలమైన కుటుంబ బంధాలు, గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ స్థానిక యాసలో సాగే ఈ పాటలు ప్రతి ఒక్కరినీ విపరీతంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా డిజిటల్ యుగంలో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలలో అందుబాటులోకి వచ్చాక మన తెలంగాణ జానపదానికి ఆదరణ ఆకాశాన్ని తాకింది.
ఈ జానపదాల ప్రపంచంలో తనదైన నాటు గాత్రంతో, సహజమైన తెలంగాణ యాసతో శ్రోతల హృదయాలను కొల్లగొట్టిన గాయని చుంచు నాగవ్వ. యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియా రీల్స్, డిజే ప్లేలిస్టుల్లో వైబ్రేషన్స్ తెస్తున్న నాగవ్వ టాప్ 5 జానపద పాటల వివరాలు గమనిస్తే..
27
బాయిలోనే బల్లి పలికే: నాగవ్వ కెరీర్‌ను మలుపు తిప్పిన సూపర్ మాస్ హిట్
నాగవ్వ అనగానే ప్రతి ఒక్కరికీ వెంటనే గుర్తొచ్చే ఐకానిక్ సాంగ్ ‘బాయిలోనే బల్లి పలికే’. ఈ పాటలో పక్కా తెలంగాణ గ్రామీణ వాతావరణం, పక్కా జానపద బాణీ కళ్లముందు కడతాయి. ప్రముఖ గాయని మంగ్లీతో కలిసి నాగవ్వ పాడిన ఈ పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది.
మంగ్లీ ఊపు తెచ్చే డ్యాన్స్ మూవ్స్, నాగవ్వ పల్లెటూరి నాటు గాత్రం కలసి ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యూట్యూబ్‌లో సుమారు 11.6 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి నాగవ్వకు ఓ రేంజ్ గుర్తింపును తెచ్చిపెట్టింది.
37
నా తిరుపతి రెడ్డి: పల్లె యాసకు దక్కిన పర్ఫెక్ట్ గుర్తింపు
నాగవ్వ సంగీత ప్రయాణంలో ఆమెకు తొలిసారిగా విస్తృత ప్రజాదరణ తెచ్చిపెట్టిన పాటల్లో ‘నా తిరుపతి రెడ్డి’ ఒకటి. తెలంగాణ పల్లెటూరి యాసను, సహజమైన గొంతును కలగలిపి నాగవ్వ ఈ పాటను ఆలపించిన తీరు శ్రోతలను ఎంతగానో అలరించింది. దాదాపు 1.39 మిలియన్ల వ్యూస్ సాధించిన ఈ గీతం, గ్రామీణ జానపదాలను అమితంగా ప్రేమించే సంగీత ప్రియులకు నాగవ్వ స్వరాన్ని బాగా దగ్గర చేసింది.
బిందె మీద బిందె పెట్టి: రీల్స్, డిజేలలో మారుమోగుతున్న చార్ట్‌బస్టర్
సంగీత ప్రియులను, ముఖ్యంగా యువతను విపరీతంగా ఆకట్టుకున్న నాగవ్వ మరో వైరల్ హిట్ ‘బిందె మీద బిందె పెట్టి సాంగ్. తెలంగాణ జానపద నృత్యాలు, ఊరి వేడుకలలో ఈ డిజే వర్షన్ పాట విపరీతంగా మారుమోగుతోంది. అమెజాన్ మ్యూజిక్ టాప్ ట్రాక్స్‌లోనూ, యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లోనూ ఈ ఎనర్జెటిక్ ఫోక్ సాంగ్ ట్రెండింగ్‌లో నిలిచి నాగవ్వ క్రేజ్‌ను రెట్టింపు చేసింది.
57
మామిడీ కోనాల మీద: పల్లె అందాల మధురమైన జానపదం
జానపద సంగీతంలో ప్రకృతి అందాలను, గ్రామీణ భావాలను ఎంత అద్భుతంగా చెప్పవచ్చో నిరూపించే పాట ‘మామిడీ కోనాల మీద మబ్బులేమో నిలిచినాయి’. మధుప్రియ, నాగదుర్గతో కలిసి నాగవ్వ ఆలపించిన ఈ పాట గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. లిరికల్ అండ్ డిజే వర్షన్స్‌లో విడుదలైన ఈ పాట యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ఇప్పటికీ అలరిస్తూనే ఉంది.
67
యెద్దులచే ముద్దువెట్టే, మోహన లాలి: మట్టి వాసనల జానపద గాత్రం
నాగవ్వ గాత్రంలో వచ్చిన మరో అద్భుతమైన పాట ‘యెద్దులచే ముద్దువెట్టే పాట. సింగర్ ప్రభతో కలిసి పాడిన ఈ పాటలో తెలంగాణ పల్లె సంస్కృతి, జీవనశైలి స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే ఆమె పాడిన ‘మోహన లాలి’ పాట జానపదంలో మెలోడీకి ఉన్న ప్రాధాన్యంను చాటిచెప్పడమే కాకుండా నాగవ్వలోని సహజమైన గాయనిని పరిచయం చేసింది.
77
నాగవ్వ జానపద పాటలకు ఎందుకింత ప్రత్యేక ఆదరణ?
చుంచు నాగవ్వ పాటల్లోని ప్రధాన బలం ఆమె గొంతులో ఉండే స్వచ్ఛమైన సహజత్వం, మన పల్లెటూరి ప్రాంతీయ యాస. కేవలం పాటలు పాడటమే కాకుండా, మన గ్రామీణ జీవన విధానాన్ని ఒక కళారూపంగా ప్రతిబింబించడం ఆమె ప్రత్యేకం.
ఈ సంగీత ప్రయాణం వెనుక ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు దాగున్నాయి. నాగవ్వ తండ్రి యక్షగానం ప్రదర్శనలు ఇచ్చేవారు. చిన్నతనం నుంచే ఆ యక్షగానం పాటలను వింటూ, నేర్చుకుంటూ పెరిగిన నాగవ్వ, ఆనాటి నుంచే పాటలపై విపరీతమైన ఆసక్తిని పెంచుకున్నారు. ఇప్పుడు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆమె తన జానపద గాత్రంతో ప్రాచీన సంప్రదాయ కళను నేటి తరం డిజిటల్ శ్రోతలకు ఎంతో సులువుగా చేరువ చేస్తున్నారు.