Singer Neha
పాడుతా తీయగా షో వివాదం ఇప్పట్లో తేలేలా లేదు. యువ గాయని ప్రవస్తి చేసిన ఆరోపణలతో పెద్ద దుమారమే చెలరేగింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు ఎంతో ఆహ్లాదంగా జరిగిన పాడుతా తీయగా షోలో ప్రస్తుతం రాజకీయాలు, కుట్రలు, పక్షపాత ధోరణి కనిపిస్తోంది అంటూ ప్రవస్తి ఆరోపించింది. జడ్జీలు కీరవాణి, సునీత, చంద్రబోస్ తమకి ఇష్టమైన వారికి మాత్రమే మంచి మార్కులు ఇస్తున్నారని పేర్కొంది.
singer pravasthi aradhya (Rtv)
సునీత తన గురించి ప్రతిసారీ నెగిటివ్ కామెంట్స్ చేస్తారని కూడా ప్రవస్తి ఆరోపించింది. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మంచి పాటలు ఇవ్వడం.. నచ్చని వారికి చెత్త సాంగ్స్ ఇచ్చి బాగా పాడలేదని కామెంట్స్ చేయడం, ఆపై ఎలిమినేట్ చేయడం జరుగుతోంది అని ప్రవస్తి పేర్కొంది. ప్రవస్తి వ్యాఖ్యలకు జ్ఞాపిక నిర్మాణ సంస్థ, సింగర్ సునీత రంగంలోకి దిగి కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది.
Singer Sunitha, Pravasthi
సునీత ఇచ్చిన క్లారిటీతో ఈ వివాదం ఇక ముగుస్తుంది అనుకుంటే.. పాడుతా తీయగా షోపై మరో గాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సింగర్ పేరు నేహా. ఆమె ప్రవస్తికి మద్దతు తెలిపారు. నేహా మాట్లాడుతూ.. పాడుతా తీయగా షోలో ప్రవస్తి చెప్పిన సంఘటనలు జరుగుతున్నాయి అని అన్నారు. నాకు కూడా ఆ అనుభవం ఎదురైంది.
singer pravasthi aradhya
మేము అడిగిన సాంగ్ ఇవ్వరు. కానీ వాళ్ళకి ఇష్టమైన కంటెస్టెంట్స్ కి మాత్రం మంచి సాంగ్స్ ఇస్తారు. ఈ సాంగ్ నా వాయిస్ కి సెట్ కాదు మార్చండి అని అడిగినా పట్టించుకోరు. నా వాయిస్ కి సెట్ కాని సాంగ్ ఇస్తే నేను ఎలా పాడాలి అని అడిగా. దీనికి వాళ్ళు ఎలాంటి సమాధానం ఇస్తారంటే.. ఆ సాంగ్ ని మీకు కీరవాణి గారు ఇవ్వమని చెప్పారనో, ఇంకొకరు ఇవ్వమని చెప్పారనో అంటారు. అప్పుడు మేము వెళ్లి కీరవాణి గారిని అడగగలమా అని నేహా తెలిపింది.
Singer Neha
వాళ్ళు ఇచ్చిన సాంగ్ నిజంగానే నా వాయిస్ కి సెట్ కాలేదు. దీనితో సరిగ్గా పాడలేకపోయా. రేపు నిన్ను ఎలిమినేట్ చేస్తున్నాం అని ముందురోజే నాకు చెప్పారు. చెప్పినట్లుగానే ఎలిమినేట్ అయ్యాను అని నేహా పేర్కొంది. అయితే ప్రవస్తి చెప్పినట్లు ఎక్స్ ఫోజింగ్ చేయమని నన్ను ఎవరూ అడగలేదు.. ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఎదురుకాలేదు అని నేహా పేర్కొన్నారు.