టాలీవుడ్ లో లెజెండ్రీ నటీమణుల్లో వాణిశ్రీ ఒకరు. వాణిశ్రీ అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి స్టార్ హీరోలతో వందల చిత్రాల్లో నటించారు. తన సెకండ్ ఇన్నింగ్స్ లో వాణిశ్రీ తల్లి, అత్త తరహా పాత్రలు కూడా చేశారు.
వాణిశ్రీకి, హీరో జేడీ చక్రవర్తికి మధ్య ఒక ఆసక్తికర సంఘటన జరిగిందట. ఈ విషయాన్ని జేడీ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. వీళ్ళిద్దరూ బొంబాయి ప్రియుడు చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో వాణిశ్రీ హీరోయిన్ రంభకి తల్లిగా నటించారు. అప్పటికి జెడి చక్రవర్తికి వాణిశ్రీతో పరిచయం లేదట. మా అమ్మ మాత్రం వాణిశ్రీకి పెద్ద అభిమాని అని జెడి చక్రవర్తి అన్నారు.
వాణిశ్రీని పరిచయం చేస్తాను అని రాఘవేంద్రరావు ఆమె వద్దకి నన్ను తీసుకెళ్లారు. నేను వెళ్ళగానే హాయ్ వాణి అని పలకరించా. వాణిశ్రీ ఆశ్చర్యంగా ఏంటమ్మా అని అడిగారు. నేను ఏమి అనలేదు.. హాయ్ వాణి అని అన్నాను అని జేడీ తెలిపారు. దీనితో వాణిశ్రీ పట్టరాని కోపంతో క్యారవ్యాన్ లోకి వెళ్లిపోయారు. రాఘవేంద్ర రావు వెంటనే.. ఏమయ్యా నేనే ఆమెని పేరు పెట్టి ఏకవచనంతో పిలవను.. నువ్వు ఏంటయ్యా ఇలా చేశావు అని లబో దిబో మన్నారు. రాఘవేంద్ర రావుని కూడా జెడి చక్రవర్తి రాఘవ అని పేరు పెట్టి పిలిస్తారట. నన్ను పిలిచినట్లే ఆమెని కూడా పేరు పెట్టి పిలిస్తే ఎలాగయ్యా అని అడిగారు. ఆశ్చర్యం ఏంటంటే జేడీ చక్రవర్తి.. వాణిశ్రీ కంటే 20 ఏళ్ళు చిన్నవాడు.
ఇప్పుడు మీకేంటి ఆమెకి నేను సారీ చెప్పాలి అంతే కదా.. వెళ్లి చెప్పేసి వస్తా అని అన్నాను. ఇప్పుడు నువ్వు సైలెంట్ గా ఉంటే ఒక రోజు షూటింగ్ మాత్రమే ఆగిపోతుంది. నువ్వు వెళ్లి ఆమెకి మళ్ళీ కోపం తెప్పిస్తే.. సినిమా మొత్తం ఆగిపోతుంది అని రాఘవేంద్ర రావు అన్నారు. కానీ నేను వినకుండా ఆమె క్యారవ్యాన్ లోకి వెళ్ళాను. క్యారవ్యాన్ లోనుంచి నేను 30 నిమిషాలు బయటకి రాలేదు.
J. D. Chakravarthy
వీడు సినిమా మొత్తాన్ని ముంచేలా ఉన్నాడు అని బయట అందరూ మాట్లాడుకుంటున్నారట. ఆ తర్వాత బయటకి వచ్చా. రాఘవేంద్ర రావు ఆతృతగా ఏం మాట్లాడవు ఆమెతో అని అడిగారు. ఏమి లేదు మీ సింహబలుడు హీరోయిన్ కి సారీ చెప్పి వచ్చా అని తెలిపాను. హమ్మయ్య హ్యాపీ అనుకున్నారు. వాణిశ్రీ గారు 10 నిమిషాల తర్వాత బయటకి వచ్చారు.
J. D. Chakravarthy
వాణిశ్రీ రాగానే రాఘవేంద్ర రావు షాట్ కి రెడీనా అమ్మా అని అడిగారు.. నేను బిగ్గరగా అరుస్తూ వాణి రెడీనా నువ్వు అని అడిగా. అందరూ నన్ను చూసి షాక్ అయ్యారు. అందరిలో నాపై ఫ్రస్ట్రేషన్ కనిపించింది. నేను వాణిశ్రీ గారిని అలా పేరు పెట్టి పిలవడానికి కారణం సరదా కోసమే అని జేడీ చక్రవర్తి అన్నారు. నేను ఎవరితో అయినా సరదాగా ఉండాలి అనుకునే వ్యక్తిని. అది వాణిశ్రీ గారు అర్థం చేసుకున్నారు అని జేడీ తెలిపారు.