Intinti Gruhalakshmi: లాస్యకు బుద్దిచెప్పిన అంకిత.. బెనర్జీ నిజ స్వరూపం బయట పెట్టిన తులసి?

First Published Jan 2, 2023, 10:22 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు జనవరి 2వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్లో ఇంట్లో పెద్దవాడిని నేనున్నా నాకు చెప్పాలి కదా అనగా వెంటనే పరంధామయ్య చెబితే నువ్వు పంపించే వాడివి అనడంతో వెళ్లకుండా ఇంటికి తాళాలు వేసేవాడిని అనడంతో అందుకే నీకు చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇంట్లో ఎవరు చిన్న పిల్లలు లేరు వాళ్లకు నచ్చినట్టు వాళ్ళు ఉంటారు అని అంటాడు పరంధామయ్య. అప్పుడు లాస్య అదేంటి అంకుల్ వాళ్ళకు నాన్న మాట వినమని చెప్పాల్సింది పోయి ఇలా మాట్లాడుతున్నారు అనడంతో మరి నాన్న మాట వినాలి అన్నప్పుడు ఈ నాన్న మాటే వినకుండా లాస్యని ఎందుకు పెళ్లి చేసుకున్నారు అనడంతో లాస్య నందు ఇద్దరు షాక్ అవుతారు.

అప్పుడు పరంధామయ్య వీళ్ళు తులసి ఇంటికి వెళ్లడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు శృతికి ఈ పరిస్థితి రావడానికి గతంలో అంకిత అబార్షన్ జరగడానికి అన్నింటికీ తులసీనే కారణం అని అంటాడు నందు. నా నమ్మకాలు నా భయాలు నాకు ఉంటాయి అనడంతో అవి పనికిరాని నమ్మకాలు అంకుల్ అని అంటుంది అంకిత. అప్పుడు లాస్య ఇది చాలా దారుణం అంకిత తులసిని సేవ్ చేయడం కోసం మీ అమ్మ మీద ఇలాంటి నిందలు వేస్తావా అనడంతో మీరు కావాలని తులసి అంటేనే బ్లేమ్ చేయాలని చూడకండి అని అంటుంది అంకిత. అప్పుడు ప్రేమ్ అమ్మ చెప్పబట్టే మేము అందరు ఇక్కడ ఉన్నాం లేకపోతే ఉండే వాళ్ళం కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి అనగా దివ్య కూడా అవును మా కాళ్లకు సంకెళ్లు వేయొద్దండి అని అంటుంది.
 

అప్పుడు నందు తులసి కేవలం మన ఇంటికి చుట్టం తనతో మీరు మాట్లాడండి కానీ నన్ను లాస్య ని మాత్రం నెగ్లెట్ చేయొద్దు మన ఇంటి సమస్యలు తులసితో మాట్లాడవద్దు అని అంటాడు. ఎలాంటి  ప్రాబ్లమ్స్ ఉన్న  ఫస్ట్ నాతో మాట్లాడండి ఇలాంటి సిచువేషన్లు మల్లి ఇంట్లో రాకూడదు అని అంటాడు. మరొకవైపు తులసి సామ్రాట్ గారు ఈ మీటింగ్ కు సంబందించిన పనులన్నీ నాకు అప్పచెప్పాడు ఇది చదివి అర్థం చేసుకుందామంటే మొత్తం ఇంగ్లీషులో ఉంది అనుకుంటూ ఉంటుంది. అప్పుడు దివ్య కి కాల్ చేసి ఈ విషయంలో హెల్ప్ తీసుకుంటాను అని దివ్య కి ఫోన్ చేసి చెబుతుంది. అప్పుడు దివ్య, తులసికి అర్థమయ్యే విధంగా అన్ని చెబుతూ ఉంటుంది.
 

మరొకవైపు పరంధామయ్య చెమటల పడి ఇబ్బంది పడుతుండగా అప్పుడు అనసూయను లేపి కొంచెం చక్కెర తీసుకొని రమ్మన్నాను తొందరగా కిందికి వెళ్తుంది అనసూయ. లాస్య అన్నింటికి కిచెన్ లో లాక్ చేసి ఉండడంతో లాస్య వాళ్ల గది దగ్గరికి వెళుతుంది అనసూయ. అప్పుడు మీ మామయ్య గారి పరిస్థితి బాగోలేదు చక్కెర నీళ్లు కలిపి ఇవ్వాలి లేకపోతే ఆయన ఏమవుతాడో తెలియదు అనడంతో నిద్రలో ఉన్నాను ఆ రాక్ కీస్ ఎక్కడ పెట్టానో గుర్తులేదు అత్తయ్య అని నెగ్లెట్ గా మాట్లాడుతూ ఉంటుంది లాస్య. ఈ రాత్రికి ఎలాగో అలా చూడండి నాకు నిద్ర వస్తుంది అని తలుపులు వేసి పడుకుంటుంది లాస్య. అప్పుడు అనసూయ టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది.
 

 అప్పుడు కిందికి వెళ్ళగా అప్పుడు అంకిత అక్కడ ఉండడంతో అంకితకు జరిగింది మొత్తం వివరిస్తుంది. అప్పుడు అంకిత శృతి గదికి వెళుతుంది. శృతి గది దగ్గరికి వెళ్లి కొంచెం గ్లూకోస్ పౌడర్ కావాలి అని ఇప్పించుకొని వెళ్లి పరంధామయ్యకు కలిపి ఇస్తుంది. అప్పుడు ప్రేమ్ వాళ్ళు లేయలేదా అని అనసూయ అడగడంతో లేచారు. నేను అబద్ధం చెప్పి అర్ధరాత్రి గొడవలు ఎందుకని ఇక్కడికి వచ్చేసాను అని అంటుంది అంకిత. అప్పుడు అంకిత అనసూయ ఇద్దరు ఇంట్లో పరిస్థితి తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఆ సంగతి ఏమి ఆలోచించొద్దు రేపు చూసుకుందాం అని అంకిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు సామ్రాట్ బెనర్జీ అనే వ్యక్తిని వచ్చాడు అనడంతో తులసి ఇంకా రాలేదా అని టెన్షన్ పడుతూ ఉంటాడు.

అప్పుడు మీటింగ్ కంటే ఇంపార్టెంట్ పని తులసి గారికి ఏముంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు సామ్రాట్. మరొకవైపు తులసి బెనర్జీ కి సంబంధించిన ప్రొడక్ట్స్ గురించి అతని గురించి ఒక అతన్ని అడిగి వివరాలు తెలుసుకుంటూ ఉంటుంది. మరొకవైపు అంకిత కిచెన్ లో వంట చేస్తూ ఉండగా ఇంతలో లాస్య అక్కడికి వచ్చి తలనొప్పిగా ఉంది కాఫీ పెట్టివ్వు అని అనడంతో అంకిత పట్టించుకోకుండా పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు లాస్యకు రివర్స్ లో కౌంటర్లు ఇస్తుంది అంకిత. కాఫీ నేను పెట్టి ఇవ్వను నువ్వే వెళ్లి పెట్టుకో నడుము ఉంచు నడుము వంగదా అని అంటుంది అంకిత. అప్పుడు లాస్య అంకిత ఎక్కువ మాట్లాడుతున్నావు  అంకిత అనడంతో నేను ఎక్కువ మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు అని అంటుంది. అయినా మాకు మా తులసి ఆంటీ సంస్కారం నేర్పింది ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసు అని అంటుంది.
 

అప్పుడు లాస్య బెధిరిస్తున్నావ అనడంతో  జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని అంటుంది అంకిత. రాత్రి తాతయ్యకు షుగర్ వాటర్ కావాలి అని షుగర్ కోసం కిస్ అడిగితే కనిపించడం లేదు అని నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతావా అని అంకిత అనడంతో సడన్గా నిద్ర లేపి కీస్ అడిగితే కోపం రాదా అనడంతో ఇప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది అంటుంది అంకిత. ఇప్పుడేమైంది మీ తాతయ్యకు బాగానే ఉన్నాడు కదా అనడంతో కాబట్టి నువ్వు ఇక్కడ ఇలా ఉన్నావు లేకపోతే అంకుల్ నిన్ను మెడబట్టి బయటికి గెంటే వాడు అనగా అంకిత అని గట్టిగా అరుస్తుంది లాస్య. చూడు ఆంటీ తాతయ్య నానమ్మల ఆరోగ్యం బాగా ఉన్నంతవరకే నీ ఆటలు వాళ్లకు ఏమైనా అయితే ఎలా ఉంటుందో నీకు పరిస్థితి ఆల్రెడీ చెప్పాను కదా అని అంటుంది.
 

మరొకవైపు సామ్రాట్, బెనర్జీ అందరూ తులసి కోసం వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడు మీరు సీఈవో అండి ఆఫ్టర్ జనరల్ మేనేజర్ కోసం ఎదురు చూడటం ఏంటి నాకు సీఎం దగ్గర అమ్మాయిన్మెంట్ ఉంది నేను వెళ్ళాలి తొందరగా సైన్ చేయండి అని అంటాడు. అప్పుడు సామ్రాట్ అగ్రిమెంట్ మీద సైన్ చేస్తుండగా ఇంతలో తులసి వచ్చి ఆగండి అని అంటుంది. అప్పుడు తులసిని చూసి నవ్వుకుంటూ ఉంటాడు బెనర్జీ. అప్పుడు బిజినెస్ చేసేటప్పుడు నిజాయితీ ఉండాలి అని బెనర్జీతో మాట్లాడడంతో బెనర్జీ కోప్పడుతూ ఉంటాడు. అప్పుడు సామ్రాట్ ఏమైంది తులసి గారు అనడంతో అయినా స్కూల్ పెడతాను అన్నచోట గవర్నమెంట్ నుండి ఆర్డర్ ఉంది అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగకూడదు అనడంతో సామ్రాట్ గారు ఆవిడ మాటలు పట్టించుకోకండి అని అంటాడు బెనర్జీ. నా దగ్గర స్కూల్ కట్టడానికి అప్రూవల్ ఉంది అనడంతో దొంగగా తీసుకు వచ్చింది ఎప్పటికైనా సమస్య అవుతుంది అని అంటుంది తులసి.
 

అప్పుడు తులసిని చులకనగా చేసి వంటింట్లో ఉండాల్సిన వారిని ఇలా బిజినెస్ లో తీసుకొస్తే ఇలాగే ఉంటుంది సామ్రాట్ గారు అని అనగా పర్సనల్ విషయాలు గురించి మాట్లాడకండి తులసి అడిగిన దానికి సమాధానం చెప్పండి అనడంతో ఏంటి సార్ మీరు ఎంతోమంది బిల్లింగ్ కట్టారు వాళ్ళందరికీ అప్రూవల్స్ ఉన్నాయా అని నెగ్లెట్ గా మాట్లాడుతాడు. ఇవన్నీ కామన్ సార్ అనడంతో మీకు అవన్నీ కామన్ కావచ్చు కానీ డబ్బు కోసం తప్పుడు పనులు చేయకూడదు అని అంటాడు సామ్రాట్. మీరు బయలుదేయొచ్చు అని అనడంతో బెనర్జీ షాక్ అవుతాడు.

click me!