గదిలోకి పిలిచి ప్రొడ్యూసర్‌తో పడుకోవాలన్నారుః కాస్టింగ్‌ కౌచ్‌పై అంకితా లోఖండే సంచలన వ్యాఖ్యలు

First Published Mar 24, 2021, 5:24 PM IST

సుశాంత్‌ సింత్‌ రాజ్‌పుత్‌ మాజీ ప్రియురాలు, నటి అంకితా లోఖండే కాస్టింగ్‌ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రెండుస్లార్లు దీన్ని ఫేస్‌ చేసినట్టు చెప్పారు. గదిలోకి పిలిచి ప్రొడ్యూసర్‌తో పడుకొమన్నారని షాకింగ్‌ విషయం వెల్లడించింది అంకితా. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

టెలివిజన్‌ నుంచి నటిగా మారిన అంకితా లోఖండే పంచుకున్న కాస్టింగ్‌ కౌచ్‌ విషయాలు దుమారం రేపుతున్నాయి. తాను సౌత్‌ ఫిల్మ్ ఇండస్ట్రీల నుంచే ఇలాంటి చేదు అనుభవాన్ని చవిచూసిందట.
undefined
తాను హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలనుకున్న ప్రారంభంలో దీన్ని ఫేస్‌ చేసిందట. ఓ సౌత్‌ ప్రొడక్షన్‌ ఆడిషన్‌కి పిలిచిందని, గదిలోకి రమ్మని చెప్పి, ప్రొడ్యూసర్‌ వద్ద పడుకోవాలని అడిగారని వెల్లడించింది అంకితా.
undefined
తాను వ్యక్తిగతంగా చాలా స్ట్రాంగ్‌ అని, తనని చూస్తే ఎవరైనా భయపడతారని భావించినట్టు చెప్పింది. కానీ ఓ ఆడిషన్‌లో మాత్రం కాస్టింగ్‌ కౌచ్‌ ఫేస్‌ చేసినట్టు చెప్పింది అంకితా.
undefined
`అంకితా మిమ్మల్ని మేం ఏదో అడగాలనుకుంటున్నాం` అని అన్నారు. నేను `పార్టీలకా? డిన్నర్‌ కో అనుకున్నా. కానీ వాళ్లు ప్రొడ్యూసర్‌తో రాజీపడాలన్నారు. నాకు అర్థమైపోయింది.
undefined
మీకు టాలెంటెడ్‌ గర్ల్ కావాలా? నిర్మాత వద్ద పడుకునేందుకు అమ్మాయి కావాలా ? అని అడిగాను. ఈ సినిమా నేను చేయనని చెప్పేశా.
undefined
తర్వాత వాళ్లు నన్ను రిక్వెస్ట్ చేశారు. ఈ సినిమాలో నటించేందుకు ఆఫర్‌ ఇస్తున్నామని చెప్పారు. జరిగిన దానికి క్షమాపణలు చెప్పారు. కానీ నేను సినిమా చేయనని చెప్పాను.
undefined
మరో సందర్భంలో తిరిగి సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు ఓ హీరో షేక్‌ హ్యాండి ఇచ్చినప్పుడు నా చేయితో సిగ్నల్‌ ఇచ్చాడు. నాకు అది మరోలా అనిపించింది. వెంటనే నా చేతిని వెనక్కి తీసుకున్నా.
undefined
అతను సౌత్‌లో పెద్ద నటుడు. అక్కడ మనకు చోటు లేదని భావించి అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయాను` అని చెప్పింది అంకిత.
undefined
అంకితా సుశాంత్‌తో కలిసి `పవిత్ర రిష్టా` అనే టెలివిజన్‌లో నటించింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు వినిపించాయి.
undefined
ఈ సంఘటలతో అంకితా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. గతేడాది `మణికర్ణిక`లో ఓ పాత్ర పోషించింది. అలాగే `బాఘి 3`లోనూ నటించింది.
undefined
click me!