Intinti Gruhalakshmi: అభి ఆశలను ఆవిరి చేసిన అంకిత..షాక్ లో తులసి..?

Published : Jun 16, 2022, 12:23 PM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటుంది. ఇక ఈరోజు జూన్ 16  ఎపిసోడ్ లో  ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
15
Intinti Gruhalakshmi: అభి ఆశలను ఆవిరి చేసిన అంకిత..షాక్ లో తులసి..?

 ఈరోజు ఎపిసోడ్ లో తులసి (tulasi)కుటుంబం మాల్ ఎంజాయ్ చేస్తూ ఉండగా లక్కీ(lucky) కూడా వారి దగ్గరికి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మరొకవైపు నందు టెన్షన్ పడుతూ ఉంటాడు. లాస్య మాల్ కి వచ్చే లేపు లక్కీ అక్కడినుంచి ఎలా అయినా తీసుకువెళ్లాలి అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే అభి దంపతులు ప్రేమ్ దంపతులు అక్కడికి రావడంతో తులసి ఆనందం వ్యక్తం చేస్తుంది.
 

25

కుటుంబం అందరూ కలిసిపోవడంతో అందరూ ఆనందంగా ఉంటారు. ఇక ఇప్పుడు లాస్య(lasya) వస్తే ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధమే జరుగుతుంది అని నందు(nandu) టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటాడు. నందు అనుకుంటున్న విధంగానే లాస్య అక్కడికి వస్తుంది. వచ్చీరాగానే లక్కీ ఎక్కడ అని అడిగి లక్కీ తులసి దగ్గర ఆడుకుంటుండడం చూసిన లాస్య లక్కీ అంటూ గట్టిగా అరుస్తుంది.
 

35

తులసి దగ్గరికి వెళ్లి లక్కీ తీసుకుని పక్కకు వెళుతుంది. అప్పుడు అనసూయ(Anasuya)లాస్యని ఉద్దేశిస్తూ కాస్త వెటకారం గా మాట్లాడడంతో లాస్య అనసూయను ఏమీ అనలేక నందు పై విరుచుకు పడుతుంది. అప్పుడు నందు అనసూయకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుండగా ఇంతలో పరంధామయ్య నందుని తిడతాడు. అప్పుడు తులసి(tulasi) మనం ఆనందంగా ఉండడానికి వచ్చాము ఆనందంగా ఉందాం మామయ్య అని అనడంతో తులసి అక్కడినుంచి కోపంగా వెళ్ళిపోతుంది
 

45

 ఆ తర్వాత నందు ప్లాన్ ప్రకారం ఇదంతా చేశాడు అని నందు పై ఫైర్ అవుతుంది లాస్య(lasya). అప్పుడు లక్కీ అంకుల్ తప్పేం లేదు అని చెబుతూ ఉండగా లక్కీ పై కోప్పడుతుంది. ఇంతలో అభి (abhi)మధ్యలో కలగజేసుకుని  ఇందులో డాడ్ తప్పేమీ లేదు అనుకోకుండా మా ఫ్యామిలీ అందరూ ఒకచోట కలిశారు దానిని మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అని చెబుతాడు.
 

55

ఆ తర్వాత కాశ్మీర్ ట్రిప్ కోసం ఐదుగురిని సెలెక్ట్ చేయగా అందులో, తులసి, ప్రేమ్(pream), అభి దివ్య ల పేర్లు వచ్చి తన పేరు రాకపోవడంతో లాస్య అవమానంగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత అవి మా నాన్న పెట్టుబడి కోసం నేను నిన్ను డబ్బులు అడిగాను అని అంకిత (ankitha)తో అనగా నువ్వు ఇంకా మారలేదు అని ఆ చెక్కును తీసుకొని డైరెక్టుగా తులసి ఇంటికి వెళ్లి పోతుంది అంకిత..

click me!

Recommended Stories