నాగచైతన్య తో డివోర్స్ తరువాత దూసుకుపోతోంది సమంత. పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోతోంది. వరుస సినిమాలు, సోషల్ మీడియా పోస్ట్ లతో దడదడలాడిస్తోంది. ఏమాయ చేశావే సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన సమంత... మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది. చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లింది.
ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సమంత. డిమాండ్ తో పాటు రెమ్యూనరేషన్ కూడా పెంచుకుంటూ పోయింది. హీరోయిన్ గా రిటైర్మెంట్ ఏజ్ వచ్చినా... అదే ఫిట్ నెస్ల్ తో.. ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా మెయింటేన్ చేస్తోంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో ఘాటైన ఫోటోలను పోస్ట్ చేస్తూ యూత్‌ను ఆకర్షిస్తుంటుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మతిపోయేలా ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అంతే కాదు బ్రాండ్‌లను కూడా ప్రమోట్ చేస్తుంది. అయితే సమంత వరుసగా పోస్ట్ లకు.. బ్రాండ్‌లను ప్రమోట్ చేయడం ద్వారా ఎంత సంపాదిస్తుంది అనేది అందరి మదిలో మెదిలే ప్రశ్న.
ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతకు ప్రస్తుతం 24 మిలియన్ల్ ఫాలోవర్స్ అంటే రెండు కోట్ల 40 లక్షల మంది అభిమానులు ఉన్నారు. కాగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలుపోస్ట్ చేయడంతో పాటు.. కమర్షియల్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడం ద్వారా నెలకు దాదాపు ర 2 నుంచీ 3 కోట్ల వరకు సంపాదిస్తుందట.
అంతే కాదు సామ్ ప్రతి సినిమాకు 3.5కోట్ల నుంచి 4కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను అందుకుంటుంది. ప్రస్తుతం సమంత ఏడాదికి మూడు నుంచి నాలుగు సినిమాలను చేస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే సినిమాలతో కంటే సోషల్ మీడియా ద్వారానే సామ్ ఎక్కువగా సంపాదిస్తుంది.
రీసెంట్ గా సమంత నటించిన తమిళ సినిమా కతు వాకుల రెండు కాదల్ మంచి సక్సెస్ సాధించింది. నయనతార మరో ప్రధాన హీరోయిన్‌గా, విజయ్ సేతుపతి ఇంపార్టెంట్ రోల్ చేసిన ఈ సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాడు.
ప్రస్తుతం సమంత చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. తెలుగు,తమిళంతో పాటు.. బాలీవుడ్ హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది సామ్.. ఈమె గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం తో పాటు యశోదా, సినిమాలు కంప్లీట్ చేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాను చేస్తుంది.