Intinti Gruhalakshmi: తులసిపై మరో ప్లాన్ చేస్తున్న లాస్య.. చిన్న కొడుకును దగ్గరకు తీసుకున్న తులసి!

Published : Jul 07, 2022, 02:47 PM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటుంది. ఇక ఈరోజు జులై 7వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Intinti Gruhalakshmi: తులసిపై మరో ప్లాన్ చేస్తున్న లాస్య.. చిన్న కొడుకును దగ్గరకు తీసుకున్న తులసి!

ఈరోజు ఎపిసోడ్ లో లాస్య మొత్తానికి పాయిజన్ డ్రామా చేసి నందును (Nandhu) ఇంట్లోకించి బయటికి వెళ్లకుండా చేస్తుంది. దాంతో అక్కడే ఉన్న భాగ్య మొత్తానికి బావగారిని నీ మాటలు విని నీ దగ్గరికి తీసుకున్నావు కాబట్టి సరిపోయింది అంటూ లేదంటే నీ పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించుకో అని అంటుంది. అంతేకాకుండా తులసి (Tulasi) అక్క చేసిన ప్లాన్ మామూలుగా లేదు అంటూ..
 

26

ఇక్కడ నీతో అక్కడ నాతో బాగా ఆడుకుంది అని అంటుంది. భాగ్య తులసిని పొగుడుతూ ఉంటే లాస్య తనపై కోపంతో చిరాకు పడుతుంది. ఇక భాగ్య (Bhagya).. తులసి (Tulasi) తన మాజీ మొగుడిని మళ్లీ మొగుడిని చేసుకునేలా ఉందేమో అని అనటంతో.. అసలు ఊరుకునేది లేదు అంటూ.. తనకు నేనంటే ఏంటో చూపిస్తాను అని మళ్లీ ఏదో ప్లాన్ చేసేలా కనిపిస్తుంది.
 

36

మరోవైపు అంకిత (Ankitha) మళ్లీ డ్యూటీ ఎక్కుతుంది. తన అత్తయ్య తులసికి డ్యూటీ కి వెళ్తున్నానని చెబుతుంది. ఇక తులసి ఈ విషయం అభి (Abhi) కి చెప్పావా అని అంకితను అనటంతో చెప్పలేదు అని అంకిత అంటుంది. ఆ తర్వాత అంకితతో ఏదైనా కాపురం సరిదిద్దుకోవాలి అని అనడంతో సరే అని అంకిత అంటుంది.
 

46

అంతే కాకుండా ఈరోజే అభిని (Abhi) కలుస్తాను అని అంటుంది. అదే సమయంలో అనసూయ (Anasuya) సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలకు ఒక నెటిజన్ తనకు కొరియర్ పంపిస్తాడు. అంతేకాకుండా అందులో ఒక లెటర్ రాసి పంపిస్తాడు. మీరు చేసిన కాకరకాయ హల్వా వల్ల మా కుటుంబం మొత్తం ఆసుపత్రి పాలయ్యింది అని అనటంతో అందరూ తెగ నవ్వుకుంటారు.
 

56

ఆ తర్వాత అంకిత (Ankitha) ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ అభి తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పటికే అంకిత అభి కి ఫోన్ చేసి హాస్పిటల్ కి రమ్మని అనటంతో అభి అంకిత కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అంకిత రావటంతో వారి మాటల్లో మధ్యలో మళ్లీ మాటల యుద్ధం జరుగుతుంది. ఇక అభి (Abhi) మాత్రం తన తల్లి వల్లే తాము దూరమయ్యాము అని అంటాడు.
 

66

దాంతో అంకిత (Ankitha) తన అత్తయ తులసి గురించి అభి అలా అనటంతో.. అతడి పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంది. తల్లి ప్రేమ గురించి తెలియని వాడివి అంటూ అతడి పై బాగా మండిపోతుంది. ఇక మరోవైపు ప్రేమ్ తనకు పాటలు పాడాలని ఆసక్తి పోవటంతో చిరాకుగా ఉంటాడు. తరువాయి భాగంలో తులసి ప్రేమ్ కోసం ఒక అడుగు ముందుకు వేసి ప్రేమ్ (Prem) ను దగ్గరకు తీసుకుంటుంది.

click me!

Recommended Stories