సరిగ్గా ప్లాన్ చేసిన వెజిటేరియన్ డైట్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పండ్లు, కూరగాయల ద్వారా ఫైబర్ లభిస్తుంది. పప్పుల ద్వారా ప్రోటీన్ అందుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు కణాలను కాపాడుతాయి. పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సరైన ఆహార ఎంపికల వల్ల బరువు, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి.
స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ 22 జంటల కవలలపై ఎనిమిది వారాల పాటు ఒక రీసెర్చ్ చేసింది. ఒకరికి వెజిటేరియన్ డైట్, మరొకరికి నార్మల్ డైట్ ఇచ్చారు. వెజిటేరియన్ డైట్ తిన్న వారిలో బరువు, చెడు కొలెస్ట్రాల్, ఇన్సులిన్ స్థాయిలు తగ్గినట్లు గుర్తించారు. అలాగే DNA లెక్కల ప్రకారం వారి జీవసంబంధ వయస్సు సగటున 0.65 సంవత్సరాలు తగ్గినట్లు పరిశోధకులు తెలిపారు.
మిడిల్ క్లాస్ ప్రజలు సులువుగా పాటించే డైట్ ప్లాన్!
యంగ్‌గా కనిపించడానికి ఖరీదైన పండ్లు తినాల్సిన పనిలేదు. ఉదయం ఇడ్లీ, దోశతో సాంబార్ లేదా చట్నీ తినవచ్చు. మధ్యాహ్నం అన్నంలోకి ఆకుకూరలు, కూరగాయలు, పప్పు చేర్చుకోవాలి. సాయంత్రం జంక్ ఫుడ్ బదులు జామపండు లేదా బాదం పప్పులు తినాలి. రాత్రి పూట చపాతీ, కూరలు తీసుకోవచ్చు. సరిపడా నీళ్లు తాగుతూ, మంచి నిద్రపోతే ఎవరైనా ఎప్పుడూ యంగ్‌గా కనిపిస్తారు.