Aadarsha Kutumbam Movie Review: ఆదర్శ కుటుంబం మూవీ రివ్యూ, వెంకటేష్‌, త్రివిక్రమ్‌ సినిమా హిట్టా ? ఫట్టా?

Published : Oct 30, 2026, 12:05 PM IST

వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మొదటిసారి `ఆదర్శ కుటుంబం` అనే సినిమా రూపొందింది. ఇది నేడు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? హిట్టా ఫట్టా అనేది చూస్తే.

PREV
17
ఆదర్శ కుటుంబం మూవీ రివ్యూ

వెంకటేష్‌ నటించిన `నువ్వు నాకు నచ్చావ్‌`, `మళ్లీశ్వరి` చిత్రాలకు త్రివిక్రమ్‌ డైలాగ్స్ రాశారు. కానీ ఇప్పుడు తొలి సారి వెంకటేష్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో `ఆదర్శ కుటుంబం` అనే సినిమా రూపొందింది. `హౌజ్‌ నెంబర్‌ 47` అనేది ట్యాగ్‌లైన్‌. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ(చినబాబు) నిర్మించారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. నివేతా పేతురాజ్‌, నారా రోహిత్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(అక్టోబర్‌ 30)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌కి హిట్‌ పడిందా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

27
ఆదర్శ కుటుంబం మూవీ కథ

చిట్టిబాబు(వెంకటేష్‌) ప్రైవేట్‌ బ్యాంక్‌ ఎంప్లాయ్‌. ఆయన భార్య స్వర్ణ(శ్రీనిధి శెట్టి) చిట్టీల దందా పెట్టి లాస్‌ అవుతుంది. నాలుగు లక్షల అప్పు చేస్తుంది. కూతురు సంపూర్ణ(యువీనా) ఒక మెకానిక్‌ని ప్రేమిస్తుంది. కొడుకు శర్వ(రాజా ప్రజ్వల్‌) అస్తమాతో బాధపడుతుంటాడు. అప్పుల వాళ్లు వెంటపడుతుంటారు. దీంతో రోజూ ఫ్రస్టేషన్‌తో రగిలిపోతుంటాడు చిట్టిబాబు. అంతేకాదు ఉన్నట్టుండి చిట్టిబాబు జాబ్‌ పోతుంది. రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో ఆయనకు వంద కోట్ల లాటరీ తగులుతుంది. దీంతో విల్లాలోకి మారిపోతారు. వీరికి రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ బుజ్జి(రఘుబాబు) ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేస్తాడు. అయితే డబ్బు ఉన్నవాళ్లని చూసి బిహార్‌ దొంగల బ్యాచ్‌ దొంగతనాలు చేస్తుంటారు. అడ్డు వచ్చిన అందరిని చంపేస్తుంటారు.

ఈ క్రమంలో వంద కోట్ల లాటరీ తగిలిన చిట్టిబాబు ఇంటిని టార్గెట్‌ చేస్తారు. నెమ్మదిగా పనిమనుషులుగా వాళ్లింట్లో చేరతారు. డబ్బు వచ్చిన టైమ్‌ చూసి ఎటాక్‌ కి ప్లాన్‌ చేస్తారు. కట్‌ చేస్తే, అప్పటి వరకు అమాయకంగా, సమస్యలతో బాధపడుతున్న చిట్టిబాబు ఫ్యామిలీ పెద్ద ట్విస్ట్ ఇచ్చి రివర్స్ అవుతారు. దొంగలను చంపేస్తారు. పోలీసులు విచారించగా తమకేమీ తెలియదని, తాము అమాయకులమని చెబుతారు. ఈ కేసుని ఎస్పీ(నారా రోహిత్‌) విచారిస్తుంటారు. వీరిని విచారించగా, వీరి అసలు నిజస్వరూపాలు బయటపడతాయి. ఇంతకి వీళ్లు ఎవరు? వారి బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటి? వేర్వేరుగా ఉన్న ఈ నలుగురు ఒక్క ఫ్యామిలీగా ఎలా మారారు? జడ్జ్ ప్రదీప్‌ సర్కార్‌(నాజర్‌) హత్యకి, వీళ్లకి సంబంధం ఏంటి? అతని కోసం వీళ్లు ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు? ఈ కేసులో ఉన్న ట్విస్ట్ లు ఏంటనేది మిగిలిన సినిమా.

37
ఆదర్శ కుటుంబం మూవీ విశ్లేషణ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఫ్యామిలీ అంశాలకు ప్రయారిటీ ఇస్తుంటారు. ఫ్యామిలీ చుట్టూ వారి అనుబంధాలు, ఎమోషన్స్, ఫన్‌, సెంటిమెంట్‌, కొద్ది యాక్షన్‌ మేళవించి సినిమాలు రూపొందిస్తుంటారు. అయితే ఈ సారి ఆయన రూట్‌ మార్చారు. ఫ్యామిలీ చుట్టూ క్రైమ్‌ యాక్షన్‌ మూవీని తెరకెక్కించారు. తన మార్క్ దాటి తెరకెక్కించిన చిత్రమిది. ఫ్యామిలీ సెటప్‌లో ఒక క్రైమ్‌ స్టోరీని రూపొందించారు. అయితే ఇందులోనూ తన మార్క్ ఫన్‌, ఎమోషన్స్ ని, అనుబంధాలను మేళవించడం విశేషం. ఫస్టాఫ్‌ సినిమా చాలా సరదాగా సాగుతుంది. వెంకీ, శ్రీనిధి శెట్టి, కూతురు, కొడుకు పాత్రల మధ్య మంచి కామెడీని రాసుకున్నారు. అది ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది.

అలాగే జాబ్‌ పోవడం, లాటరీ తగలడం ఈ క్రమంలో వారి లైఫ్‌ మారిపోవడం, రఘుబాబు పాత్ర ఎంట్రీ, వీళ్లు విల్లాలోకి వెళ్లడం, అక్కడ సత్య పాత్ర ఎంట్రీ వేగంగా జరిగిపోతుంటాయి. అలరిస్తాయి. సత్య పాత్ర ఎంట్రీ తర్వాత మూవీ మరింత హిలేరియస్‌గా మారుతుంది. ఆయన పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో సినిమా రన్‌ అవుతుంది. వెంకీ ఇంట్లో సత్యతో వచ్చే సీన్లు బాగా నవ్విస్తాయి. ఇక దొంగలు వచ్చినప్పుడు వచ్చే ట్విస్ట్ అదిరిపోయింది. యాక్షన్‌లో వేరే లెవల్‌ చూపించారు. పాత్రలోని మలుపులు ఆకట్టుకుంటాయి. అందులోనూ సత్య పాత్రపై వచ్చే సీన్లు నవ్విస్తాయి. ఆ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది.

ఆ తర్వాత వీళ్ల బ్యాక్‌ గ్రౌండ్‌కి సంబంధించిన ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌ పై క్యూరియాసిటీ క్రియేట్‌ అవుతుంది. దొంగలు వీళ్ల ట్రాప్‌లోకి ఎలా వచ్చారు? ఇందులో పోలీస్‌ డిపార్ట్ మెంట్‌ ఇన్‌వాల్వ్ మెంట్‌ ఆసక్తికరంగా ఉంటుంది. అదే సమయంలో వెంకీ ఫ్యామిలీ దొంగలపై ఎందుకు రివేంజ్‌ తీర్చుకోవాలనుకుంటున్నారనే అంశాలు కొంత వరకు క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తాయి. ఆ తర్వాత సత్య పాత్రకి సంబంధించిన సీన్లు కూడా బాగున్నాయి.

నారా రోహిత్‌ చేసే విచారణ, అందులోనూ కామెడీగా ఉంటుంది. ఆ తర్వాత దొంగల బ్యాచ్‌కి, వెంకీ ఫ్యామిలీకి మధ్య వచ్చే సీన్లు కొంత ల్యాగ్‌ ఉంటాయి. ఆ తర్వాత సీన్లు పెద్దగా గొప్పగా లేవు. అయితే వీరి బ్యాక్‌డ్రాప్‌ కూడా అంతగా కన్విన్సింగ్‌గా లేదు. ఫన్‌ డోస్‌ తగ్గింది. ఆ తర్వాత సినిమా డ్రామా వైపు వెళ్తుంది. అది రొటీన్‌గా అనిపిస్తుంది. చివర్లో ట్రైన్‌ ఎపిసోడ్‌ ఫర్వాలేదనిపిస్తుంది. ఫైనల్‌లో అసలు విషయం రివీల్‌ చేస్తారు. అది ఓకే అనిపిస్తుంది.

అయితే పోలీసులు దొంగలను వదిలేని, వెంకీ ఫ్యామిలీని టార్గెట్‌ చేయడం కన్విన్సింగ్‌గా లేదు. ఆ పాయింట్‌ని బలంగా చూపించలేదు. జడ్జ్ ఎపిసోడ్‌ని కూడా బాగా చూపించాల్సింది. ఎండింగ్‌ మాత్రం బాగుంది. త్రివిక్రమ్‌ స్టయిల్‌లో ఉంటుంది. ఓవరాల్‌గా మూవీ ఫస్టాఫ్‌ హిలేరియస్‌గా ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌ తగ్గింది. క్లైమాక్స్ ఫర్వాలేదనిపించేలా ఉంటుంది. సెకండాఫ్‌ని మరింత బాగా చేసి ఉంటే అదిరిపోయేది.

47
ఆదర్శ కుటుంబం మూవీలో ప్లస్‌, మైనస్‌ లు

ప్లస్‌ లు- కథ, కథ నేపథ్యం, ఆర్టిస్ట్ ల నటన, ఫన్‌, యాక్షన్‌, ట్విస్ట్ లు, క్లైమాక్స్, త్రివిక్రమ్‌ మార్క్ టేకింగ్‌, డైలాగులు.

మైనస్‌లు - సెకండాఫ్‌, పాటలు, బీజీఎం.

57
ఆదర్శ కుటుంబం మూవీలో నటీనటుల నటన

చిట్టిబాబు పాత్రలో వెంకటేష్‌ ఒదిగిపోయారు. తన మార్క్ కామెడీతో అలరించారు. యాక్షన్‌తో ఇరగదీశారు. ఫన్‌ మాత్రమే కాదు, సెంటిమెంట్‌, ఎమోషన్స్ లోనూ ఆకట్టుకున్నారు. డాన్సులతో అలరించారు. నివేదా పేతురాజ్‌తో కామెడీ బాగుంది. ఫ్యామిలీలో వచ్చే సీన్లు కూడా అలరించేలా ఉన్నాయి. ఇక భార్య పాత్రలో శ్రీనిధి శెట్టి ఇన్నోసెంట్‌గా కనిపిస్తూనే నవ్వించింది. ఆ తర్వాత యాక్షన్‌ విశ్వరూపం చూపించింది. ఆమె పాత్రలోని ట్విస్ట్ అదిరిపోయింది. అలాగే యువీనా, రాజా ప్రజ్వాల్‌ సైతం దుమ్మురేపారు. వీరి పాత్రలు అదిరిపోయాయి. అంతే బాగా చేసి మెప్పించారు. కుర్రాడు ఇరగదీశాడు. సత్య పాత్ర సినిమాకి మరో హైలైట్‌. తాను కూడా అదరగొట్టాడు. ఎస్పీగా నారా రోహిత్‌ అదరగొట్టాడు. ఇకపై ఆయన ఇలాంటి పాత్రలకు ఫిక్స్ అయిపోవచ్చు. రావు రమేష్‌ పాత్ర నవ్విస్తుంది. అలాగే మిగిలిన పాత్రలు ఫర్వాలేదనిపించాయి.

67
ఆదర్శ కుటుంబం మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

సినిమాకి థమన్‌ సంగీతం అందించారు. పాటలు నారాయణమ్మ పాటబాగుంది. మిగిలిగినవి అంతగా ఆకట్టుకునేలా లేవు. బీజీఎం దారుణంగా ఉంది. ఏమాత్రం కొత్తగా లేదు. బీజీఎం బాగుంటే, సినిమా మరో స్థాయిలో ఉండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ బాగుంది. షార్ప్ గా ఉంది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. ఇక దర్శకుడు త్రివిక్రమ్‌ తన జోనర్ మార్చి చేసిన ప్రయత్నం బాగుందని చెప్పొచ్చు. నవ్వించి, యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. అదే సమయంలో ఫ్యామిలీ బాండింగ్‌ని ఆవిష్కరించారు. తన డైలాగ్‌లో మరోసారి మెప్పించారు. ఆయన ప్రతి డైలాగ్‌ హిలేరియస్‌గా ఉన్నాయి. ఆకట్టుకున్నాయి. సినిమాకి ప్లస్‌ అయ్యాయి. కాకపోతే సెకండాఫ్‌ని, ఫ్యామిలీకి సంబంధించిన ఫ్లాష్‌ బ్యాక్‌ని బలంగా రాసుకొని ఉండాల్సింది. రియల్‌ ఇన్సిడెంన్స్ ని మేళవించిన తీరు బాగుంది. ఓవరాల్‌గా కొంత వరకు ఆకట్టుకునే మూవీ అవుతుంది.

77
ఆదర్శ కుటుంబం మూవీ ఫైనల్ గా

నవ్విస్తూ, యాక్షన్‌తో థ్రిల్‌ చేస్తూ ఆకట్టుకునే ఫ్యామిలీ క్రైమ్‌ థ్రిల్లర్‌ `ఆదర్శ కుటుంబం`. త్రివిక్రమ్‌ మార్క్ డైలాగ్‌లు ప్లస్‌. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ఆకట్టుకునే `ఆదర్శ కుటుంబం`.

రేటింగ్‌: 2.75

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories